»   » హీరోని పట్టుకుని వేషాలు పట్టుకోనంటోంది

హీరోని పట్టుకుని వేషాలు పట్టుకోనంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకు అవకాశాలు లేకపోతే ఖాళీగా ఉంటాను తప్ప ఏ హీరోని రికమెండ్ చేయమని అడగను. ముఖ్యంగా నా ప్రెండ్ సంజయ్‌ని రికమండ్ చేయమని అస్సలు అడగను అంటోంది అమీషా పటేల్. తెలుగులో బద్రీ,నాని, పరమ వీర చక్ర వంటి చిత్రాలు చేసిన ఈ భామకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమానూ లేదు. అలాంటప్పుడు మీ పరిచయాలను వాడుకోవచ్చుగా అంటే ఇలా స్పందించింది. అలాగే స్నేహాన్ని అడ్డం పెట్టుకుని అవకాశాలు కొట్టేయాలనుకుంటే ఈపాటికి నేనిలా ఉండేదాన్ని కాదు. సంజయ్‌దత్ యాక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ ఉండేదాన్ని. సంజయ్, మాన్యతలతో నాకున్న అనుబంధం సినిమాలకు అతీతమైనది. అవసరం కోసం పెంచుకున్న బంధం కాదది. నన్ను తమ ఇంటి అమ్మాయిలా చూసుకుంటారు అంది.

అంతెందుకు పవర్ సినిమా ప్రారంభోత్సవం నాడు నేను కురచ గౌను వేసుకుని వెళ్లాను. ఆ విషయాన్ని మాన్యతకు ఫోన్ చేసి, వెంటనే అమీషాని డ్రెస్ మార్చుకోమని చెప్పు అని సంజయ్ అన్నారట. మాన్యత ఫోస్ చేసి, సంజూ... నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. వెంటనే డ్రెస్ మార్చుకో అని చెప్పింది. నా గురించి ఆ దంపతులు అంత కేర్ తీసుకుంటారు. ఆ ప్రేమను ఆసరాగా తీసుకుని.. అవకాశాలిప్పించమని అడిగేంత స్వార్థం నాకు లేదు. అలాగే అవకాశాలు లేకపోవడంవల్ల నేను ప్రొడక్షన్ హౌస్ ఆరంభించలేదు. నా స్నేహితుడు కునాల్ ప్రోత్సాహంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. ఈ బేనర్‌లో తీసే సినిమాల్లో ఇతర హీరోయిన్స్ కు కూడా అవకాశం కల్పిస్తా అంటోంది.ఈ బేనర్‌లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రియదర్శన్ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించబోతున్నారామె. ఈ రెండు చిత్రాల్లోనూ అమీషానే హీరోయిన్.

English summary
Amisha Patel, who launched her new production house, finally got a director in the form of David Dhawan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu