»   » ఐటం సాంగ్ తో రీ ఎంట్రీ : పవన్ హీరోయిన్,అదీ ఈ ఏజ్ లోనూ రచ్చ

ఐటం సాంగ్ తో రీ ఎంట్రీ : పవన్ హీరోయిన్,అదీ ఈ ఏజ్ లోనూ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ బద్రిలో కనిపించిన అమీషాకు ఇక్కడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లతో నటించిన అమీషా పటేల్ ఇప్పటికీ ఇంకా అవకాసాలు కోసం ఎదురుచూస్తూ, ఏదన్నా వస్తే అందిపచ్చుకుని సై అంటోంది.

తాజాగా ఆమె ఓ చిన్న తెలుగు సినిమాలో ఐటెం భామగా నటించడానికి ఒప్పుకుని షాక్ ఇచ్చింది. నలభై ఏళ్లు దాటిన ఈ ఏజ్ లో ఐటం సాంగ్ ఏంటని నోళ్లు నొక్కుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఏజ్ కు, ఐటం సాంగ్ కుసంభందం లేదనుకోండి.

కహోనా ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఈ భామ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది అయితే తెలుగులో ఓ వెలుగు వెలిగిపోవాలని ఆశించింది కానీ పాపం ఈ భామకు మాత్రం ఆ చాన్స్ దొరకలేదు .

Amisha Patel back to Tollywood

ఈ మధ్యన అమీషా ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. దాంతో ఆమెకు కొత్త సినిమాలలో హీరోయిన్ అవకాశాలు రాలేదు కానీ , తెలుగులో ఐటం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట. తెలుగులో చివరగా బాలకృష్ణ సరసన పరమవీరచక్ర సినిమాలో నటించిన అమీషా... త్వరలోనే 'ఆకతాయి' అనే సినిమాలో ఐటం బ్యూటీగా కనిపించబోతోందట.

సినిమాలోని హీరో హీరోయిన్లు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా అమీషా ఐటం సాంగ్‌తో సినిమాకు క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అంతేకదా అమీషా పటేల్ ఉంది కాబట్టే మనం కూడా మాట్లాడుకుంటున్నాం. ముందు ఆకతాయి అనే సినిమా వస్తోందని జనాలకు అర్దమవుతోంది. లేకపోతే చిన్న సినిమాకు ప్రత్యేకమైన పబ్లిసిటి చేయాలంటే కష్టం కదూ.

English summary
Amisha Patel acted in Pawan Kalyan's 'Badri' and Mahesh Babu's 'Nani' . Now 40-year-old actress has now returned to Tollywood to do an item song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu