»   »  వెంటపడి తరిమారు, అమీషా పటేల్‌కు తీవ్ర గాయాలు

వెంటపడి తరిమారు, అమీషా పటేల్‌కు తీవ్ర గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amisha Patel
ముంబై: హీరోయిన్ అమీషా పటేల్‌కు ఓ సినిమా షూటింగులో తీవ్ర గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆమె మెట్లపై నుండి కింద పడిపోయింది. దీంతో ఆమె చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వమించిన వైద్యులు కొన్ని రోజుల వరకు ఆమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు.

ఇంకా టైటిల్ ఖరారుకాని తన రాబోయే చిత్రంలో నటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకంది. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగా.....ఆమెను కొందరు వ్యక్తులు తరుముతున్నారు. వారి నుండి తప్పించుకునేందుకు ఆమె పరుగులు పెడుతోంది. ఈక్రమంలో మెట్ల పై నుండి పరుగుపరుగు దిగుతుండగా అమీషా కింద పడిపోయింది. మెట్ల పై నుండి పడటంతో గాయాలు తీవ్రంగా అయ్యాయి.

2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'కహోనా ప్యార్ హై' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అమీషా పటేల్ ఆ చిత్రం విజయంతో లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే తర్వాత ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం పరాజయం పాలవ్వడంతో అమీషాకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. మెయిన్ హీరోయిన్‌గా అమీషా కెరీర్ ఎప్పుడో ముగిసింది.

ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్, ఇతర క్రింది స్థాయి పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది అమీషా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రన్ బోలా రన్, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యాజిక్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 37 ఏళ్ల అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకుండానే ఒంటరి జీవితం సాగిస్తోంది.

English summary
Amisha Patel suffered from a major injury when she fell down from the stairs while she was shooting for an action scene for one of her upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu