»   » డెడ్లీ కాంబినేషన్....! ఒకే తెర పై ఇద్దరు అద్బుతమైన హీరోలు

డెడ్లీ కాంబినేషన్....! ఒకే తెర పై ఇద్దరు అద్బుతమైన హీరోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇద్దరు లెజెండ్స్ చేతులు కలప బోతున్నారు. బాలీవుడ్ లో హీరో అనే కంటే నటుడు అంటే నే బాగా సూటయ్యే ఇద్దరు వ్యక్తులు అమితాబ్ బచ్చన్, ప్రయోగాల నటుడు అమీర్ ఖాన్. ఈ ఇద్దరికీ ఒక ఫార్ములా ఉంది ముందు కథ హీరోగా ఉన్న సినిమాలో వీళ్ళు రెండో హీరోగా చేయాలనుకుంటారు. అందుకే ఈ ఇద్దరూ.... ఒక మార్క్ ని వేయగలిగారు. సోలో హీరోగానే ఒక రేంజ్ హిట్ కొట్టే అమీర్ ఇక ఇండియన్ మూవీ బాద్షా తో చేతులు కలిపితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.

అమీర్ ఖాన్ , అమితాబ్ ఒకే తెర మీద.. ఆమీర్‌ ఖాన్‌ చేసిన ట్వీట్‌తో ఆ విషయం ఖరారైంది. అమితాబ్‌తో కలసి నటిస్తుండటం ఆనందంగా ఉందంటూ ఆమీర్‌ ట్వీట్‌ చేశారు. ''నేనెంత కాలంగానో ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. అమితాబ్‌తో కలసి నటించాలన్న కోరిక నెరవేరబోతోంది.జీవితంలో అనుక్షణం నేను ఆరాధించిన వ్యక్తితో తెరను పంచుకోబోతుండటం ఉద్వేగంగా ఉంది.అందుకు ఆదిత్య చోప్రా, విజయ్‌కృష్ణలకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ....

Amitabh and Aamir Khan in one film for the first time

ప్రముఖ నిర్మాణ సంస్థ 'యశ్ రాజ్ ఫిలిమ్స' అమితాబ్-ఆమిర్ కాంబినేషన్లో సినిమా నిర్మించబోతోంది. 'ధూమ్' సిరీస్‌తో తొలి రెండు సినిమాలకు రచయితగా పని చేసి.. మూడో భాగంతో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆమిర్ ఖాన్ సోలో హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేకైపోతోంది. ఇక అమితాబ్ బచ్చన్‌తో జట్టు కట్టాడంటే ఇక ప్రకంపనలు రావడం ఖాయం. ప్రస్తుతం 'దంగల్' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఆమిర్.. ఈ ఏడాది ఆఖర్లో 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' షూటింగ్‌లో పాల్గొంటాడు. 2018 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించేశారు.

అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆమీర్‌తో నటిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 'కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ థగ్‌' అనే నవల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది మొదలు కానుంది.2018 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Aamir and Amitabh will be teaming up for Yash Raj Films' new project titled Thugs of Hindustan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu