»   » మెగాస్టార్ ని పట్టుకొని "అతనికి బుర్రలేదు" అన్నాడు... బుర్ర తిరిగే ఆన్సర్ వచ్చింది

మెగాస్టార్ ని పట్టుకొని "అతనికి బుర్రలేదు" అన్నాడు... బుర్ర తిరిగే ఆన్సర్ వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

డబ్బులుంటే ఎవరైనా కబుర్లు చెబుతారని.. అలా చేయండి.. ఇలా చేయండి అంటూ ఉపన్యాసాలు దంచుతారని.. ఊరికే మాటలు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని.. గ్రౌండ్లోకి దిగి ఏదైనా చేస్తేనే ఉపయోగం అని కట్జూ అన్నారు. ఈ విషయమై ఆయన ఫేస్ బుక్ లో పెద్ద పోస్టు పెట్టడం విశేషం. అదీ ఎవర్ని ఉద్దేశించో తెలుసా?? బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ని అదీ మామూలుగా కాదు...

భార‌తీయుల‌కు మతం అనేది ఓపియం వంటి మత్తు పదార్థం. ప్రజలు తిరుగుబాటు చేయకుండా మూల‌న‌ పడి ఉండాలంటే పాలకులు ఈ డ్రగ్స్ ను వాడతారని కారల్ మార్క్స్ చెప్పాడు. అయితే భార‌తీయుల‌కు కేవలం ఒక డ్రగ్ మాత్రమే కాదు.. వాళ్లకు చాలా డ్రగ్స్ అవసరం. ఇలాంటి డ్రగ్స్ లో సినిమాలు, మీడియా, క్రికెట్, జ్యోతిష్యం, బాబాలు మొదలైనవి. కొన్ని జబ్బులకు కొన్ని మందులను కలిపి ఎలా ఇస్తామో అలాగే భారతీయ ప్రజలకు మన ప్రభుత్వాలు కొన్ని కాంబినేషన్లతో కూడిన మందులను ఇవ్వాల్సి. అలాంటి పవర్ ఫుల్ డ్రగ్స్ లో సినిమాలు కూడా ఒకటి.

మీరు ప్రజలకు బ్రెడ్ ఇవ్వలేకపోతే సర్కస్ షో లను ఇవ్వండి అని రోమన్ రాజులు అనేవారు. మన సినిమాలు చాలా వరకు సర్కస్ లాంటివే. ఈ ప్రభుత్వాలు మనకు ఉద్యోగం, హెల్త్ కేర్, పోషకాహారం, నాణ్యమైన విద్య వంటివి ఇవ్వలేకపోతున్నాయి.. దేవానంద్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నావంటి వారి సినిమాల్లాంటివే అమితాబ్ సినిమాలు కూడా.

Amitabh answer to Mr Justice Markandeya Katju "He is right, my head is khallas"

ఇవి ప్రజల్ని భ్రమలో ముంచెత్తేవి. అందువల్లే ప్రజలు చడీ చప్పుడు లేకుండా ఉండడానికి మన పాలకులకు ఇవి చాలా అవసరమయ్యాయి. అమితాబ్ మంచి నటుడే అయినా దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన ఏదైనా సైంటిఫిక్ ఐడియా ఇచ్చారా ? కోట్ల కొద్దీ డబ్బులు మూలుగుతుంటే ఎవరైనా మీడియా ఛానళ్లలో సందేశాలు మాత్రం ఇస్తుంటారు అంటూ ఒక పక్క ఏకిపారేస్తూనే... అమితాబ్ తాను ఒకే పాఠశాలలో చదువుకున్నామని.. ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని కట్జూ వ్యాఖ్యానించారు. అమితాబ్ పై సెటైర్లు వేస్తూ పనిలో పనిగా మీడియా వాళ్లకు కూడా చురకలంటించాడు కట్జూ. ''అమితాబ్ బుర్రలో ఏమీ లేదు. ఆయన్ని అదే పనిగా పొగిడే మీడియా వాళ్లను చూస్తే వాళ్ల బుర్రల్లో కూడా ఏమీ లేదేమో అనిపిస్తుంది'' అని కట్జూ అన్నారు.

బిగ్ బీ తాజా మూబీ పింక్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు, మీడియా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతోంది. కానీ ఇదే క‌ట్జూకి న‌చ్చ‌లేదు. అస‌లు అమితాబ్ మెద‌డులో ఏమీ లేద‌ని, ఆయ‌న‌ను ఇంత మంది పొగుడుతున్నారంటే వాళ్ల మెద‌ళ్ల‌లోనూ ఏమైనా ఉందో లేదో నాకు సందేహ‌మే అంటూ క‌ట్జూ త‌న ఎఫ్‌బీ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, క‌ర‌కు విమ‌ర్శ‌లు చేయ‌డం క‌ట్జూకి ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ చాలా మందిపై ఇలా ప‌బ్లిగ్గా విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

ఐతే కట్జూ వ్యాఖ్యలపై అమితాబ్ చిత్రంగా స్పందించాడు. కట్జూ మాటలు వాస్తవమే అని.. తన బుర్రలో ఏమీ లేదని ఆయన అనడం విశేషం. 'జస్టిస్‌ కట్జూ చెప్పిందే కరెక్టే. నా మెదడు లోపల నిజంగా ఏమీ లేదు. దేశంలో ఏదైనా జరిగితే.. అందులో మేం పాలుపంచుకుంటాం. కానీ, ఆయనే కరెక్ట్‌. నా మెదడు ఖల్లాస్‌ అయింది' అని వ్యాఖ్యానించారు. ఇద్ద‌రం ఒకేలాంటి వాళ్లం. ఆయ‌న నా సీనియ‌ర్‌. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి శ‌త్రుత్వం లేదు అంటూ అమితాబ్ ఎంతో హుందాగా, క‌ట్జూకి ఎక్క‌డో త‌గిలేలా జ‌వాబిచ్చారు.

English summary
Responding to Justice Katju’s criticism, Amitabh told to a english daily, “Justice Katju is right. I really don’t have anything inside my head.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu