»   » హాట్ 'షార్ట్ ఫిలిం' అద్భుతం అంటూ మెగాస్టార్

హాట్ 'షార్ట్ ఫిలిం' అద్భుతం అంటూ మెగాస్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : దర్శకుడు సుజోయ్ ఘోష్ తీసిన 'అహల్య' షార్ట్ ఫిలిం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారిన సంగతి తెలిసిందే. ఈ షార్ట్ పిలిం ను తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చూసారు. అంతేకాదు ఆయన ఆ షార్ట్ ఫిలిం పై సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు. అయనేం షార్ట్ పిలిం గురించి మాట్లాడుతున్నారో ఇక్కడ చూడండి.

FB 1029 - https://www.youtube.com/watch?v=Ff82XtV78xo … ... the magic of short films .. Sujoy Ghosh .. brilliant !!I...

Posted by Amitabh Bachchan on 22 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ షార్ట్ ఫిలింలో సౌమిత్ర చటర్జీ, రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. 14 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం.. పురాణాల్లోని అహల్య పాత్ర ఆధారంగా తీసినదే. 'షార్ట్ ఫిలింల మ్యాజిక్ అంటే ఇదే.. సుజోయ్ ఘోష్ అద్భుతం' అని అమితాబ్ ట్వీట్ చేశారు.

దాంతోపాటు షార్ట్ ఫిలిం లింకు కూడా షేర్ చేశారు. దాంతో సంబరపడిపోయిన సుజోయ్ ఘోష్.. 'ఐ లవ్యూ సర్' అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ షార్ట్ ఫిలిం ను మీరు ఇక్కడ చూడవచ్చు.

14 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకుడు. ఇందులో అహల్య పాత్రలో రాధికా ఆప్టే నటిస్తుండగా హీరోగా బెంగాలీ సీనియర్ నటుడు సౌమిత్ర చటర్జీ నటిస్తున్నారు.

కాగా అహల్య స్టోరీ తనను చిన్నప్పటి నుంచి ఆలోచింపజేస్తూనే ఉందనీ, అందుకని దాన్ని ఎలాగైనా తీయాలన్న కల నేటికి ఫలిస్తోందని చెప్పుకొచ్చారు డైరెక్టర్. ఐతే ఆయన తీస్తున్న ఈ అహల్య మహాభారతంలో ఉన్న అహల్యనా లేదంటే దానికి మోడ్రన్ హంగులు దిద్ది లాగిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అసలు అహల్య కథేమిటో ఒక్కసారి చూద్దాం.

Amitabh Bachchan applauds ‘Ahalya’, calls it brilliant

పోలీస్ ఆఫీసర్ ఏదో పని మీద ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఓ అందమైన అమ్మాయి తలుపు తీసింది. క్షణం పాటు అతనికి ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలాయనతో మాట్లాడుతున్నాడు. అతను అక్కడ ఉన్నంతసేపు ఆమె తన చిలిపి చేష్టలతో కవ్విస్తూనే ఉంది. హఠాత్తుగా ఆ పోలీస్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడుతోంది... ఈ దృశ్యాలన్నీ 'అహల్య' అనే బెంగాలీ లఘు చిత్రం ట్రైలర్‌లోవి.

ఆ అందమైన యువతిగా నటించిన హీరోయిన్ - రాధికా ఆప్టే. 'ధోని','లెజెండ్', 'లయన్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాధికా ఆప్టే ఇందులో చాలా సై్పసీగా నటించారు. విద్యాబాలన్‌తో 'కహానీ' చిత్రం తెరకెక్కించి అందరి ప్రశంసలూ అందుకున్న సుజయ్ ఘోష్ ఈ లఘు చిత్రానికి దర్శకుడు.

English summary
Amitabh Bachchan loved Sujoy Ghosh's short film "Ahalya", starring Soumitra Chatterjee and Radhika Apte.
Please Wait while comments are loading...