»   » భీష్ముడిగా అమితాబ్, భీముడిగా మోహన్‌లాల్.. ఐశ్వర్య.. 600 కోట్లతో మల్టీస్టారర్..

భీష్ముడిగా అమితాబ్, భీముడిగా మోహన్‌లాల్.. ఐశ్వర్య.. 600 కోట్లతో మల్టీస్టారర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దిగ్గజం, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నారు. భారీ వ్యయంతో తెరకెక్కనున్న రాండామూజమ్ చిత్రంలో భీష్మ పితామహుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. మోహన్ లాల్ భీమసేనుడి పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాగార్జున, విక్రమ్‌లు కూడా నటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

బియాండ్ బోర్డర్‌లో విలన్‌గా

బియాండ్ బోర్డర్‌లో విలన్‌గా

ప్రస్తుతం మోహన్ లాల్ 1971 బియాండ్ బోర్డర్ అనే చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మంజువారియర్, హన్సిక, అల్లు శిరీష్ నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

బిగ్‌బీ నటిస్తున్న మాట నిజమే..

బిగ్‌బీ నటిస్తున్న మాట నిజమే..

రాండామూజమ్ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారని చిత్ర దర్శకుడు శ్రీకర్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అవును చిత్రంలో బిగ్ బీ భీష్ముడిగా నటిస్తున్నారు. పౌరాణిక పాత్రకు ఎలాంటి మార్పులు చేయడం లేదు. పురాణాల ప్రకారమే ఆ పాత్రను తెరకెక్కిస్తున్నాం అని శ్రీకర్ తెలిపారు.

ఐశ్వర్య రాయ్ కూడా..

ఐశ్వర్య రాయ్ కూడా..

రాండామూజమ్‌లో అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటిస్తున్నారనే సంచలన వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా ధ్రువీకరణ జరుగలేదు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఐశ్వర్యతో సంప్రదింపులు జరుతున్నాం. ఇంకా చర్చలు పూర్తి కాలేదు అని శ్రీకర్ వెల్లడించారు.

 భీముడిగా మోహన్‌లాల్

భీముడిగా మోహన్‌లాల్

ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడిగా కనిపిస్తారు. అమితాబ్‌తో కలిసి ఆయన నటించడం ఇది మూడోసారి. గతంలో రాంగోపాల్ వర్మ రూపొందించిన ఆగ్‌లో, 2010లో మలయాళ చిత్రం కందాహార్ చిత్రంలో కలిసి నటించారు.

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్..

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్..

రాండామూజమ్ చిత్రంలో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ భాగస్వామ్యం కానున్నారు. ఈ చిత్రంలో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌కు రూపకల్పన చేయనున్నారు. మా ప్రాజెక్ట్‌లో పీటర్ హెయిన్స్ భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా ఉన్నది.

. రూ. 600 కోట్ల వ్యయంతో..

. రూ. 600 కోట్ల వ్యయంతో..

ఈ సినిమా సుమారు రూ.600 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన ప్రజాదరణ పొందిన నవల రాండామూజమ్ ఆధారంగా నిర్మిస్తున్నారు.

 సర్కార్‌3లో బిగ్ బీ

సర్కార్‌3లో బిగ్ బీ

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సర్కార్3 చిత్రంలో నటిసున్నారు. మే 12 విడుదలవుతున్న ఈ చిత్రంలో యామీ గౌతమ్, అమిత్ సాధు, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Randamoozham is being made under a budget of Rs 600 crores. The film is based on M T Vasudevan Nair's popular novel Randamoozham. Amitabh Bachchan will reportedly star as Bhishma in Randamoozham, also starring Mohanlal. Mohanlal plays the protagonist, Bheemasenan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu