»   » పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో అమితాబ్ చిత్రం..పూరీ జగన్నాధ్

పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో అమితాబ్ చిత్రం..పూరీ జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమితాబ్ బచ్చన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం 'బుడ్డా"హోగా తేరా బాప్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ముంబాయిలోని వేర్‌సోవా ఖోజా బంగ్లాలో ప్రారంభమైంది.పూరీజగన్నాథ్ ముహూర్తపు సన్నివేశాన్ని సోనూసూద్‌పై చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీజగన్నాథ్ మాట్లాడుతూ- అమితాబ్‌కు నేను చిన్నప్పటి నుంచి అభిమానిని.అటువంటి గొప్ప వ్యక్తితో ఇలాంటి సెనే్సషనల్ మూవీ చేయడం సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్ మార్చి 11 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు.సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదలవుతుంది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్టోరీ ఎక్స్‌లెంట్‌గా ఉంటూ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మంచి కమర్షియల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఈ చిత్రంలో హేమమాలిని, రవీనాటాండన్, సోనాల్ చౌహాన్, చార్మీ, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, షేవర్ అలి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమోల్‌రాథోడ్, సంగీతం: విశాల్ శేఖర్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాణం: ఎబి కార్పొరేషన్ అండ్ వయాకామ్ 18, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీజగన్నాథ్.

English summary
Puri Jagannath said that he is a big fan of Amitabh Bachchan and feels privileged to do this film. Amitabh will join the sets from March 11 and Budda will be shot in a single schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu