»   »  ఉయ్యాలవాడలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. చిరంజీవితో తొలిసారి ‘బిగ్‌’స్టార్.. క్రేజీ క్రేజీ కాంబినేషన్

ఉయ్యాలవాడలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. చిరంజీవితో తొలిసారి ‘బిగ్‌’స్టార్.. క్రేజీ క్రేజీ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముందే సంచలనాలకు వేదిక మారుతున్నది. బాహుబలి తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరగడంతో ఆ క్రేజ్‌ను అనుకూలంగా మలచుకోవడానికి ఉయ్యాలవాడను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే దిగ్గజ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. ఈ చిత్రం నటీనటుల ఎంపికపై ఓ వార్త ఇండస్ట్రీలో సెన్సేషనల్‌గా మారింది. ఉయ్యాలవాడలో బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు సూపర్‌స్టార్లు నటిస్తున్నారనే విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఉయ్యాలవాడను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

ఉయ్యాలవాడకు ఇంటర్నేషనల్ క్రేజ్

ఉయ్యాలవాడకు ఇంటర్నేషనల్ క్రేజ్

ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్రం ఓ స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను చిరంజీవి పోషిస్తున్నారు. ఈ పాత్ర గెటప్ కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. గడ్డం, మీసాలతో వినూత్నంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిగా చిత్రంగా మలచాలన్నది నిర్మాత రాంచరణ్ ప్లాన్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ హీరోయిన్ల కోసం..

బాలీవుడ్ హీరోయిన్ల కోసం..

ఉయ్యాలవాడ చిత్రం కోసం బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను నటింపచేయాలని పలువురు తారలను సంప్రదించారట. వారిలో ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, విద్యాబాలన్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి సరసన ఐశ్వర్యరాయ్, సోనాక్షి సిన్హాల ఎంపిక పూర్తయిందనట్టు సమాచారం. వీరి ఎంపికను త్వరలోనే నిర్మాత కల్యాణ్ రామ్ ప్రకటిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.

కీలకపాత్రలో ప్రపంచ సుందరి

కీలకపాత్రలో ప్రపంచ సుందరి

ఉయ్యాలవాడలో చిరంజీవి సరసన సోనాక్షి హీరోయిన్ కాగా, ఐశ్వర్యరాయ్ ఫ్లాష్ బ్యాక్‌లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నదట. ఈ పాత్ర కోసం ఐశ్వర్య భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా అందుకు వెనుకాడకుండా నిర్మాత ఆ మెుత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డారనేది లేటెస్ట్ న్యూస్. ఉయ్యాలవాడ కథలో ఐశ్వర్యరాయ్ పోషించే పాత్ర అత్యంత అద్భుతంగా ఉంటుందట. ఆ పాత్రలో ఐశ్వర్యరాయ్ ఫెర్మార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టడం ఖాయమమనే మాట వినిపిస్తున్నది.

సోనాక్షి మరోసారి దక్షిణాదిలో..

సోనాక్షి మరోసారి దక్షిణాదిలో..

ఉయ్యాలవాడలో సోనాక్షి సిన్హా గ్లామర్ హీరోయిన్‌గా కనిపిస్తుందట. ఇప్పటికే దక్షిణాదిలో సోనాక్షి లింగ చిత్రంలో మెరిసింది. ఆ చిత్రంలో రజనీకి సరిజోడుగా కనిపించింది. బాలీవుడ్‌లో సెంటిమెంట్, గ్లామర్ హీరోయిన్‌గా, యాక్షన్ హీరోయిన్‌గా విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నది. తాజాగా ఉయ్యాలవాడలో అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొనే విధంగా ఆమె పాత్ర ఉంటుందనే తాజా సమాచారం.

చిరంజీవితో అమితాబ్ బచ్చన్

చిరంజీవితో అమితాబ్ బచ్చన్

ఇదిలా ఉంటే ఉయ్యాలవాడలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రను పోషించడానికి అంగీకరించారనేది ఇండస్ట్రీలో ఓ వార్త బాంబులా పేలింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డికి గురువుగా నటించబోతున్నారట. ఒకవేళ అదే నిజమైతే అమితాబ్ చేరికతో ఈ చిత్రం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా మారడమే కాదు. . ఇండియాలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.

ఉయ్యాలవాడపై ప్రత్యేక పరిశోధనలు

ఉయ్యాలవాడపై ప్రత్యేక పరిశోధనలు

ఉయ్యాలవాడ కోసం మహామహులైన కథా రచయితలు, స్క్రీన్‌ప్లే నిపుణులు కసరత్తు చేస్తున్నారట. ఇప్పటి జనరేషన్ తగినట్టుగా మేకింగ్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారట. ఉయ్యాలవాడ జీవితానికి సంబంధించిన సాహిత్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఆ పోరాటయోధుడి గురించిన విషయాలను తెలుసుకోవడానికి మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ప్రత్యేకంగా పరిశోధన చేపట్టారట. ఇటీవల కాలంలో బుర్రా సాయి మాధవ్ మాటలు అందించిన చిత్రాలు గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 లాంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలువడం విశేషం.

చిరంజీవి నోట మాటలు తూటల్లాగా

చిరంజీవి నోట మాటలు తూటల్లాగా

ఉయ్యాలవాడ కోసం బుర్రా సాయి మాధవ్ రాస్తున్న మాటలు తెరమీద తూటాలుగా పేలుతాయని అంటున్నారు సినీ వర్గాలు. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి పలికే మాటలకు థియేటర్లు ఈలలు, కేకలతో మోతమోగడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఇలాంటి విశేషాలతో సిద్ధమవుతున్న ఉయ్యాలావాడలో చిత్రం చిరంజీవి నటజీవితంలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

Celebrities Who Changed Their Name For Fame
English summary
Uyyalawada Narsimha Reddy with full of Stars. Big B Amitabh, Ishwarya Rai, Sonakshi Sinha are playing lead and important roles. Chiranjeevi's son Ram Charan is the producer for this movie. Burra Sai Madhav is the dialogue Writer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu