»   » రెజీనాకు ఆ అవకాశమే గొప్ప... మెగాస్టార్‌కు వ్యతిరేకం అయితే ఏంటి?

రెజీనాకు ఆ అవకాశమే గొప్ప... మెగాస్టార్‌కు వ్యతిరేకం అయితే ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెజీనా... తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్. అందం, టాలెంట్ రెండూ మెండుగా ఉన్నా తాను అనుకున్న రేంజికి ఇంకా చేరుకోలేదు. వచ్చిన అవకాశాలను, పాత్రలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగాలనే కృషితో ముందుకు సాగుతోంది.

మరి రెజీనా లాంటి మామూలు హీరోయిన్ కు బాలీవుడ్లో భారీ ఆఫర్ వస్తే? అందులోనూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం వస్తే? ఎగిరి గంతేయడం ఖాయం. ఇటీవల రెజీనాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఆ సినిమా పేరు 'ఆంఖేన్-2'. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం. ఈ సినిమా అవకాశం తన వద్దకు రాగానే మారు మాట్లాడకుండా ఒకే చెప్పేసింది రెజీనా. తనకు ఈ సినిమాలో ఆఫర్ చేసిన పాత్ర అమితాబ్ పాత్రకు వ్యతిరేకంగా, నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ.... ఆయనతో నటించే అవకాశం చేజార్చుకోవడం ఇష్టం లేక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమాతో రెజీనా బాలీవుడ్లో అడుగు పెడుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ముంబైలో జరిగిన మూవీ అనౌన్స్ మెంట్ కు సంబంధించిన ఫోటోస్, అమితాబ్, రెజీనా డాన్సింగ్ పిక్స్ స్లైడ్ షోలో...

ఆంఖేన్ 2

ఆంఖేన్ 2

ఆంఖేన్ 2 సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కార్యక్రమం బుధవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు.

ఇలియానా కూడా

ఇలియానా కూడా

ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఇలియానాను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో రెజీనా పాత్ర కీలకంగా ఉండబోతోంది.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో అమితాబ్, ఇలియానా, రెజీనాతో పాటు అర్షద్ వర్సీ, అనీల్ కపూర్, రాంపాల్ అర్జున్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

హ్యాపీ

హ్యాపీ

త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలో ఛాన్స్ రావడంపై రెజీనా చాలా హ్యాపీగా ఉంది.

English summary
Check out photos of Bollywood actor Amitabh Bachchan along with Regina Cassandra during the announcement of Bollywood movie Aankhen-2, in Mumbai on Wednesday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X