»   » కూతుళ్లే ప్రత్యేకమని తేల్చి చెప్పిన మెగా స్టార్

కూతుళ్లే ప్రత్యేకమని తేల్చి చెప్పిన మెగా స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ఎంతైనా కూతుళ్లే ప్రత్యేకం అంటున్నారు బాలీవుడ్ మెగా స్టార్ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌. ఈ వారం డాటర్స్‌ డే సందర్భంగా అమితాబ్‌ కూతురి గురించి తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అమితాబ్ తన అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోయర్స్ కు 'డాటర్స్ వీక్' శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరించారు.

'మీ కూతురును ఎప్పుడూ బేటా అని పిలుస్తారు. అయితే కొడుకును ఎప్పుడూ బేటీ అని పిలవరు. అందుకే కుమార్తెలు ప్రత్యేకం. అందరికీ డాటర్స్ వీక్ శుభాకాంక్షలు. కూతురంటే భారం కాదు పదిమంది కొడుకులతో సమానం. మీకు కూతురు ఉన్నందుకు గర్వించాలి' అని అమితాబ్ ట్వీట్ చేశారు.

ఇటీవల అమితాబ్‌ ఓ ఆధునిక, స్వతంత్ర భావాలున్న యువతికి ప్రియమైన తండ్రిగా 'పీకూ' సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Amitabh Bachchan: A Daughter is Not Equal to Tension, But Ten Sons

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమితాబ్‌ బచ్చన్ కొత్త చిత్రాల సంగతికి వస్తే....

అమితాబ్‌ బచ్చన్‌, ఫరాన్‌ అక్తర్‌, అదితీరావ్‌ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాజిర్‌'. ఈ చిత్రానికి విధువినోద్‌ చోప్రా నిర్మాత. 'సైతాన్‌'తో ఆకట్టుకున్న బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫరాన్‌ అక్తర్‌ ఉగ్రవాద నిరోధక అధికారిగా నటిస్తున్నాడు.

జాన్‌ అబ్రహం, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్ర తాజా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అమితాబ్‌ పొడవాటి జుట్టు, కోరమీసంతో కొత్తగా కనిపిస్తున్నారు. చిత్రంలో అమితాబ్‌ పాత్ర ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంది. డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నారు.

అలాగే... అబ్దుల్ కలాం బయో పిక్ త్వరలో రాబోతుంది. అబ్దుల్ కలాం పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కలాం టైటిల్‌తో వస్తున్న ఆ చిత్రాన్ని దర్శకులు నీలా మాధవ్ పాండా రూపొందిస్తారు. కలాం పాత్రను అమితాబ్ మాత్రమే చేయగలడని పాండాఅన్నారు.

అమితాబ్‌కు ఉన్న అశేష అభిమానుల ఆధరణ, ఆకర్షణ దీనికి తోడ్పడుతుందని పాండా చెప్పారు. గతంలో పాండా దర్శకత్వంలో వచ్చిన ఐ యామ్ కలాం పలు అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే.

English summary
Amitabh Bachchan has wished his fans and followers a 'Happy Daughter's Week', and has stressed on the importance of daughters as they are a matter of pride.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu