»   » అమితాబ్ కి మరో అరుదైన పురస్కారం

అమితాబ్ కి మరో అరుదైన పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ని మరో అరుదైన పురస్కారం వరించింది. ఈ నెల 22 నుంచి హాంకాంగ్‌లో జరగనున్న ఆసియన్‌ చిత్రోత్సవంలో అమిచాబ్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందుకోనున్నారు. బాలీవుడ్‌ సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగాను ఆయనకు ఈ ఆవార్డు ప్రకటించారు. ''హాంకాంగ్‌ ఆసియన్‌ చిత్రోత్సవం నన్ను జీవితకాల సాఫల్య పురస్కారంతో ఆశీర్వదించేందుకు నిర్ణయించింది. దీనికి నేనెంతో గర్వపడుతున్నా'' అని అమితాబ్‌ తన బ్లాగులో పేర్కొన్నారు. అమితాబ్‌ ప్రపంచ సినిమాకు వన్నె తెచ్చారని చిత్రోత్సవ డైరెక్టర్‌ షా సూవై కితాబిచ్చారు. ఈ సందర్బంగా ధట్స్ తెలుగు కూడా ఈ ప్రముఖ నటుడికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu