twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మతో రణానికి బిగ్ బీ సిద్దం?

    By Staff
    |

    Ram Gopal Varma
    మీడియా బ్యాక్ డ్రాప్ లో రామ్ గోపాల్ వర్మ తాజాగా రణ్ అనే సినిమా రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ప్రధాన పాత్ర అమితాబ్ చేయనున్నారా అనేదే ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చేశారు. త్వరలోనే మళ్లీ సినిమాల్లో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ...''రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో మళ్లీ ఓ చిత్రంలో నటించాలనుకొంటున్నాను. అది ఫలానా చిత్రమని ఇప్పుడే ఏమీ చెప్పలేను. అతని క్రియేటివిటీకి దాసోహమయ్యాను. 'సర్కార్‌' చిత్రానికి, 'ఆగ్‌' చిత్రాల రెండింటికీ ఒకేలా కష్టపడ్డాను. ఒకటి విజయవంతమైతే.. మరొకటి ఘోర పరాజయం చవిచూసింది. కానీ రెండింటి విషయంలో వర్మ ఒకేలా ఉన్నారు. అతనికున్న తెగువ నాకు నచ్చింది.

    ఇక మేమిద్దరం కలిసి 'సర్కార్‌-3'కి పనిచేసే అవకాశాలున్నాయా అని కొందరు అడుగుతున్నారు. ఏమో త్వరలోనే అది జరగవచ్చేమో.. అయితే ఇప్పుడే వాటి గురించేమీ చెప్పలేను. ఏదైనా వర్మ నుంచే ముందు వార్త బయటకు రావాలి. పరాజయాలు పలుకరిస్తున్నప్పుడే 'ఫూంక్‌'తో మళ్లీ తన సత్తా చూపారు వర్మ. త్వరలోనే మీడియాపై 'రణ్‌' కూడా తీస్తున్నాడు. అన్నీ కుదిరితే మా ఇద్దరి నుంచి అతి త్వరలోనే ఓ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయ''ని చెప్పారు.

    ఇప్పటికే అమితాబ్‌కి వర్మ 'రణ్‌' కథాంశాన్ని సంక్షిప్తంగా వినిపించారని సమాచారం. ఆయన నటించడానికి అంగీకరించారని చెప్తున్నారు.అలాగే ఈయనతో పాటు ఆదిత్య పంచోలి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వర్మ స్క్రిప్టు పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే శ్రీలంకలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి లొకేషన్లు చూడటానికి కూడా త్వరలోనే బయలుదేరి వెళ్లనున్నాడని తెలిసింది. మల్లికా శెరావత్‌, పరేష్‌ రావల్‌ కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఏదైమైనా వర్మ దర్శకత్వంలో మరో మారు బిగ్ బీ నటించటం అనేది ఆర్ధికంగానూ,ట్రేడ్ లోనూ మంచి విజయమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X