»   »  షూటింగ్ లో ప్రమాదం...అమితాబ్‌కు గాయం

షూటింగ్ లో ప్రమాదం...అమితాబ్‌కు గాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘టీఈ3ఎన్‌' చిత్రీకరణ కోల్‌కతాలో జరుగుతోంది. బుధవారం రాత్రి షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్‌కు ప్రమాదవశాత్తు పక్కటెములకు గాయమైంది. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో తెలిపారు.

‘‘శ్వాస పీల్చుకుంటున్నప్పుడు నొప్పిగా ఉంటోంది. కోలుకోవడానికి 48 గంటలు పడుతుందని డాక్టర్‌ చెప్పారు. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను''అని రాసుకొచ్చారు అమితాబ్‌. నొప్పితో బాధపడుతున్నప్పటికీ ‘వాజిర్‌' ప్రివ్యూ షోకు స్నేహితులను తీసుకెళ్తున్నట్లు అమితాబ్‌ చెప్పారు.

గతేడాది ‘షమితాబ్‌', ‘పీకూ' చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించిన అమితాబ్‌ బచ్చన్ ఈ కొత్త ఏడాదిలో ‘వాజిర్‌'తో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఫరాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేఫ్‌ జాన్‌ అబ్రహమ్‌, అదితిరావ్‌ హైదరి కీలక పాత్రల్లో నటించారు. బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వంలో విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

Amitabh Bachchan injured in Kolkata shoot

అమితాబ్‌ ఇందులో వీల్‌ఛైర్‌కే పరిమితమైన వికలాంగుడిగా కనిపించబోతున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో ఆయన కాళ్లు మోకాళ్ల వరకే కనిపించేలా చేశారు. ఇక అమితాబ్‌ గెటప్‌ కొత్తగా ఉంటుంది. నుదుటిపైన వేలాడే పొడవాటి జుత్తు, కోర మీసంతో కనిపిస్తారు. అమితాబ్‌ ఇందులో ‘ఖేల్‌ ఖేల్‌ మే..', ‘యారీ..' పాటలని స్వయంగా ఆలపించడం విశేషం.

English summary
Bollywood superstar Amitabh Bachchan, injured his rib cage while shooting for a crucial scene on the sets of Ribhu Dasgupta’s film Te3N on Thursday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu