»   » 'బాహుబలి' నేనూ చేస్తే బాగుండేదంటూ...

'బాహుబలి' నేనూ చేస్తే బాగుండేదంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తెలుగు సినిమాగా మొదలైన 'బాహుబలి'... ప్రపంచ సినిమాగా మారిపోయింది. ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా 'బాహుబలి' ఫ్యాన్ గా మారిపోయారు. భళ్లాలదేవగా నటించిన రానా అమితాబ్‌కు ఆన్‌లైన్‌లో 'బాహుబలి' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూపించాడు. అది చూసి అమితాబ్‌ ముగ్ధుడైపోయారు. రానాతో జరిపిన ఆన్‌లైన్‌ సంభాషణలో అమితాబ్‌ 'బాహుబలి'పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


''బాహుబలి' ఫస్ట్‌లుక్‌ చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనుకుంటున్నాను. హాలీవుడ్‌ చిత్రాల్లోనే ఈ స్థాయి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. రాజమౌళి చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు. 'బాహుబలి'లో నేనూ పాలుపంచుకొని ఉంటే బాగుండనిపిస్తోంది. ఇలాంటి సినిమా భారతీయ వెండితెరపై ఇంతవరకూ రాలేదు''ని అమితాబ్‌ కొనియాడారు.


Amitabh Bachchan lauds Baahubali

"ఇలాంటి విజువల్ వండర్‌ను ఇండియన్ సినిమాపై ఆవిష్కరించడానికి గట్స్ ఉండాలి. కేవలం హాలీవుడ్‌లో మాత్రమే చూడగల విజువల్ ఎఫెక్ట్స్‌ను ఒక ఇండియన్ సినిమాలో చూడడం అద్భుతంగా ఉంది. "అని అన్నారు.


దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇలా భారీ తారాగణమంతా ముంబైలో హల్‌చల్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో బాహుబలికి భారీ క్రేజ్ తెచ్చిపెట్టే క్రమంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.


Amitabh Bachchan lauds Baahubali

ఇక ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు రానా బాహుబలి ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లను చూపించారట. ట్రైలర్, ఫస్ట్‌లుక్ చూసిన అమితాబ్ బచ్చన్, రాజమౌళి టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.


అమితాబ్ లాంటి సూపర్ స్టార్ బాహుబలిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం విశేషం. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

English summary
Amitabh Bachchan lauded all those who have worked in S S Rajamouli’s Baahubali , and also wished he had been a part of such an epic film. Baahubali is gearing up for a huge release on the 10th of July.
Please Wait while comments are loading...