»   » రామ్ గోపాల్ వర్మ వంగ‌వీటి.... అమితాబ్, నాగార్జున‌ వస్తున్నారు!

రామ్ గోపాల్ వర్మ వంగ‌వీటి.... అమితాబ్, నాగార్జున‌ వస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం వంగ‌వీటి. రీసెంట్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో రెండు పాట‌ల‌ను ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే పాడారు. ఈ పాట‌ల‌కు, ఆ పాట‌ల సాహిత్యానికి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుండి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది.

రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.


అమితాబ్, నాగార్జున

అమితాబ్, నాగార్జున

ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. బిగ్ బి, నాగార్జున వంటి స్టార్స్ ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో వంగ‌వీటిపై భారీ క్రేజ్ నెల‌కొంది. బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.


ఉత్కంఠ.., ఆసక్తీ..., సంచలనం.... వంగవీటి ఆడియో ఫంక్షన్ హైలేట్స్ ఇవే

ఉత్కంఠ.., ఆసక్తీ..., సంచలనం.... వంగవీటి ఆడియో ఫంక్షన్ హైలేట్స్ ఇవే

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో విడుల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేసారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘వంగవీటి’ వర్మ హక్కు, నన్ను తప్పుగా చూపినా నమ్మరు: దేవినేని నెహ్రూ

‘వంగవీటి’ వర్మ హక్కు, నన్ను తప్పుగా చూపినా నమ్మరు: దేవినేని నెహ్రూ

వర్మతో భేటీ అనంత‌రం వంగ‌వీటి సినిమా గురించి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ వర్మ తనను గతంలో ఈ సినిమా విషయమై కలిసాడని, డైరెక్ట‌ర్ల‌కి ఏ క‌థ‌నైనా సినిమాగా తీసుకునే స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయ‌ని ఆ రోజే చెప్పానని అన్నారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


అమ్మ ఇచ్చిన ఙ్ఞాపకం ఇదే... వర్మ, జయలలిత తో తన ఫొటో షేర్ చేసాడు

అమ్మ ఇచ్చిన ఙ్ఞాపకం ఇదే... వర్మ, జయలలిత తో తన ఫొటో షేర్ చేసాడు

'క్షణక్షణం' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును జయలలిత చేతుల మీదుగా అందుకొన్నారు. తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే 'అమ్మ' 75 రోజులు మృత్యువుతో పొరాడి సోమవారం రాత్రి 11.30కు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ జయలలితను గుర్తుచేసుకుంటూ ఆమె చేతులతో అవార్డు అందుకుంటున్న ఫొటోను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు వర్మ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Amitabh Bachchan, Nagarjuna To attend Vangaveeti release event on 20 th Dec at JRC Center. Sensational director Ramgaopal Varma’s new fllm Vangaveeti music released recently in Vijayawada to a thundering response . Varma’s distinctive voice in two songs and lyrical intensity is highly appreciated by music lovers. Producer Dasari Kiran Kumar of Ramdhutha Creations banner is conducting a special event of the film Vangaveeti on evening of December 20th at JRC Convention Center, Jubilee Hills in Hyderabad 3 days before the release of the film on 23rd. The event will be a super exceptional event with none other than Amitabh Bachchan attending as chief guest. This is the first time ever the Bollywood super star
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu