»   » సచిన్ చర్యతో...అమితాబ్ గుండె ఆగినట్లు ఫీలయ్యాడట!

సచిన్ చర్యతో...అమితాబ్ గుండె ఆగినట్లు ఫీలయ్యాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటికే ఇంటర్నేషనల్ వన్డేలు, ఇంటర్నేషనల్ టి-20లకు గుడ్ బై చెప్పిన ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెస్టులకు కూడా వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదదైన రీతిలో స్పందించారు. సచిన్ రిటైర్మెంట్ వార్త విని తనకు గుండె ఆగినంత పనైందని వ్యాఖ్యానించారు.

ఈ విషయమై బిగ్ బి మాట్లాడుతూ 'ఆ వార్త వినగానే, నా గుండె కొట్టుకోవడం ఆగినట్లు ఫీలయ్యాను. ఇండియన్ క్రికెట్ హార్ట్ బీట్ ఆగినట్లు భావిస్తున్నాను. అతని గురించి, అతను క్రికెట్‌కు చేసిన సేవ గురించి చెప్పడానికి మాటలు రావడడం లేదు. ఆయన ఓ అసాధారణ ఆటగాడు. దేశానికి ఆయన ఎంతో గర్వకారణం' అని వ్యాఖ్యానించారు.

రెండువందల టెస్టును ఆడిన అనంతరం మాస్టర్ టెస్టులకూ దూరం కానున్నారు. ఇప్పటికే టెండుల్కర్ అంతర్జాతీయ వన్డే, ట్వంటీ20లకు గుడ్ బై చెప్పారు. తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, కోల్‌కతలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టెస్టుల అనంతరం సచిన్ తప్పుకోనున్నారు.

క్రికెట్ లేని జీవితాన్ని తాను ఊహించుకోలేనని సచిన్ టెండుల్కర్ బిసిసిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. క్రికెట్ లేకుండా జీవించడం దుర్భరమే అన్నాడు. తాను 11వ ఏట నుండి క్రికెట్ ఆడుతున్నానని, దేశం తరఫున ఆడటం తన కల అని అది నెరవేరిందన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు.

English summary
Megastar Amitabh Bachchan is disappointed over master blaster Sachin Tendulkar's decision to call it quits after his 200th Test match. "When I heard this news, I felt my heart beat has stopped. The heart beat of Indian cricket has stopped. I don't have words to praise him and his work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu