»   »  సెక్స్ సైట్స్ నేను ఫాలో చేయలేదు : అమితాబ్‌

సెక్స్ సైట్స్ నేను ఫాలో చేయలేదు : అమితాబ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌లో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, బ్లాగ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తన అనుభవాలు, అభిప్రాయాలను, సినీ విశేషాలను అభిమానులతో ఎక్కువగా పంచుకుంటుంటారు అమితాబ్‌ బచ్చన్‌.

44 వేలమందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ... తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ హ్యాక్‌ అయిందని, ఎవరో ఫాలోవింగ్‌ అన్న విభాగంలో అనవసర, అసభ్యకరమైన వెబ్‌సైట్లు వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమితాబ్‌ బచ్చన్ కొత్త చిత్రాల సంగతికి వస్తే....

అమితాబ్‌ బచ్చన్‌, ఫరాన్‌ అక్తర్‌, అదితీరావ్‌ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాజిర్‌'. ఈ చిత్రానికి విధువినోద్‌ చోప్రా నిర్మాత. 'సైతాన్‌'తో ఆకట్టుకున్న బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫరాన్‌ అక్తర్‌ ఉగ్రవాద నిరోధక అధికారిగా నటిస్తున్నాడు.

Amitabh Bachchan's Twitter Account Hacked

జాన్‌ అబ్రహం, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్ర తాజా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అమితాబ్‌ పొడవాటి జుట్టు, కోరమీసంతో కొత్తగా కనిపిస్తున్నారు. చిత్రంలో అమితాబ్‌ పాత్ర ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంది. డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నారు.

అలాగే... అబ్దుల్ కలాం బయో పిక్ త్వరలో రాబోతుంది. అబ్దుల్ కలాం పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కలాం టైటిల్‌తో వస్తున్న ఆ చిత్రాన్ని దర్శకులు నీలా మాధవ్ పాండా రూపొందిస్తారు. కలాం పాత్రను అమితాబ్ మాత్రమే చేయగలడని పాండాఅన్నారు.

అమితాబ్‌కు ఉన్న అశేష అభిమానుల ఆధరణ, ఆకర్షణ దీనికి తోడ్పడుతుందని పాండా చెప్పారు. గతంలో పాండా దర్శకత్వంలో వచ్చిన ఐ యామ్ కలాం పలు అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే.

English summary
AMITABH BACHCHAN LOGGED IN ON TWITTER AND FOUND HIMSELF FOLLOWING 'SEX SITES' AND DEDUCED THAT HIS ACCOUNT HAD BEEN HACKED. HE ALERTED HIS FANS: "WHOA !..MY TWITTER HANDLE HACKED ! SEX SITES PLANTED AS 'FOLLOWING' ! WHOEVER DID THIS, TRY SOMEONE ELSE, BUDDY, I DON'T NEED THIS !"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu