»   » నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంది: మనవరాలు ఆరాధ్యపై అమితాబ్

నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంది: మనవరాలు ఆరాధ్యపై అమితాబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూడేళ్ల తన మనవరాలు ఆరాధ్య తనను మురిపిస్తోందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నాడు. మూడేళ్ల మనవరాలు ఆరాధ్యతో 72 ఏళ్ల అమితాబ్ మురిపాలు పోతున్నాడు. ఎప్పుడూ షూటింగులతో తీరిక లేకుండా ఉండే అమితాబ్ సమయం చిక్కినప్పుడు మనవరాలు ఆరాధ్య చెప్పే కబుర్లు, కథలతో నివోదిస్తున్నాడు.

తన ఆనందాన్ని ప్రకటిస్తూ అణితాబ్ బ్లాగ్‌లో వ్యాఖ్యలు పోస్టు చేశాడు. "మా బుజ్జి ఆరాధ్య నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంటితో పాటు తన స్నేహితులు, బొమ్మల మీద ఎంతో వింత కథలు చెబుతూ మాట్లాడుతుంది" అని అమితాబ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Amitabh Bachchan Says Granddaughter Aaradhya Talks 'Non-Stop'

ఆరిందానిలా చమత్కారంగా మాట్లాడుతుంటే భలే ముచ్చటగా ఉందని, ఆమెతో సమయం గడపడం తనకు చాలా సంతోషంగా ఉందని అమితాబ్ చెప్పుకున్నాడు. ఈ దుష్ట ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న చిన్నారుల జీవితాల్లో సంతోషంగా ఉండే రోజులు ఇవే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యారాయ్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య, 2011లో ఈ బాలీవుడ్ దంపతులకు ఆరాధ్య జన్మించింది.

English summary
Megastar Amitabh Bachchan says his three-year-old granddaughter Aaradhya is an inquisitive child and very mature for her age.
Please Wait while comments are loading...