»   » ఫోటోలు : షూటింగులో నాగ్, అమితాబ్, ప్రభు

ఫోటోలు : షూటింగులో నాగ్, అమితాబ్, ప్రభు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ అమితాబ్, టాలీవుడ్ స్టార్ నాగార్జున కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల్లో వీరు ప్రచారం చేస్తుండగా, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్, మళయాలంలో నటి మంజు వారియర్ అంబాసిడర్లు. తాజాగా వీరిపై ఆయా భాషలకు సంబంధించిన యాడ్ చిత్రీకరణ ఇటీవల జరిగింది.

అమితాబ్ బచ్చన్ ఇటీవల తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. 'రెండు రోజుల్లో 4 డిపరెంట్ లాంగ్వేజ్ లలో 4 యాడ్ ఫిల్మ్స్ చిత్రీకరించాం. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలలో యాడ్ ఫిల్మ్ చిత్రీకరించారు.' అని అమితాబ్ వెల్లడించారు.

ముంబైలో కొన్ని రోజుల క్రితం ఈ యాడ్ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొంటూ 'కళ్యాణ్ జ్యువెల్లర్స్ షూటింగ్. మూడు భాషలకు చెందిన లెజండరీ యాక్టర్స్ తనయులతో పని చేస్తున్నా. ఆ లెజెండ్స్ ఎవరో కాదు శివాజీగణేశన్, రాజ్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు' అంటూ ట్వీట్ చేసారు.

ఈ సందర్భంగా అమితాబ్ నాగార్జున తండ్రి నాగేశ్వరరావుపై, ప్రభు తండ్రి శివాజీ గణేశన్‍‌పై, శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ లెజండరీ యాక్టర్స్ టాలెంట్ గురించి పలు ప్రశంసలు చేసారు.

అమితాబ్ బచ్చన్ మరిన్ని విషయాలు వెల్లడిస్తూ...ఉదయం 7 గంటలకే షూటింగ్ ప్రారంభమైంది. రాత్రి 11 గంటల వరకు సాగింది. గతంలో కూడా కళ్యాన్ జ్యువెల్లర్స్ యాడ్‌కు సంబంధించి పలు యాడ్లలో మేము కలిసి పని చేసాం అని వెల్లడించారు.

కన్నడ నటుడు అజయ్ రావు, నటి రాగిణి ద్వివేది కూడా ఈ సారి యాడ్లో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ సారి యాడ్ ఫిల్మ్ చాలా గ్రాండ్‌గా, వినియోగదారులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించారు.

నాగార్జున ఈ సందర్బంగా మాట్లాడుతూ...చాలా కాలం తర్వాత అమితాబ్ గారితో కలిసి నటిస్తున్నాను. ఆయనతో కలిసి పని చేసినప్పుడల్లా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాను. నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అని తెలిపారు.

మలయాళం నటి మంజు వారియర్ మాట్లాడుతూ...దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ జ్యువెల్లరీ యాడ్ కోసం అమితాబ్ బచ్చన్‌తో కలిసి కెమెరా ముందుకు వస్తున్నానని వెల్లడించారు.

ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ అని, సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి షూటింగ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంజు వారియర్ వెల్లడించారు. తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసారు.

English summary
Amitabh Bachchan shot the commercials for Kalyan Jewellers with some of the big names of South Indian film industries. Shivaraj Kumar (SRK), the son of legendary Kannada superstar Rajkumar, Sivaji Prabhu, the son of Sivaji Ganeshan, Nagarjuna, the son of Akkineni Nageshwara Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu