»   » అలా చేస్తే ఎవరికీ కనిపించకుండా పోతా : అమితాబ్ వార్నింగ్

అలా చేస్తే ఎవరికీ కనిపించకుండా పోతా : అమితాబ్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పుట్టినరోజు వేడుకలు జరుకోవడం అంటే ఒకప్పుడు తమ స్టేటస్‌కు సింబల్ గా భావించేవారు. ముఖ్యంగా సినిమా స్టార్లలో ఇలాంటి పోకడలు ఎక్కువగా కనిపించేవి. ఇక ఆ నటుడు పెద్ద స్టార్ అయి ఉంటే అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఏమైందో తెలియదు కానీ.... తన పుట్టినరోజు వేడుకలు ఎవరూ జరుపడానికి వీల్లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని, తన మాటను కాదని ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరూ కనుక్కోలేని ప్రాంతానికి వెళ్లిపోతానని ఇటీవల వార్నింగ్ ఇచ్చారు.

అమితాబ్ 75

అమితాబ్ 75

అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 75వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు ఇప్పటి నుండే వేడుకల గురించి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.

అమితాబ్ బిజీ బిజీ

అమితాబ్ బిజీ బిజీ

75 ఏళ్ల వయసులోనూ అమితాబ్ అలుపు లేకుండా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన '102 నాటౌట్', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రాల్లో నటిస్తున్నారు.

`కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి9` షురూ

`కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి9` షురూ

సినిమాలతో పాటు ఆయన `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి` అనే టీవీ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 9వ సీజన్ ప్రారంభమైంది. సెట్లో షూటింగ్ జ‌రుగుతున్న ఫొటోల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్‌ ద్వారా షేర్ చేశారు.

సరికొత్తగా

సరికొత్తగా

`కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి9` గత సీజన్ల కంటే కొత్తగా ఉండబోతోంది. ప్రాథమిక నియ‌మాల్లో పెద్ద‌గా మార్పు లేకున్నా సాంకేతిక‌త‌కు ఎక్కువ ప్రాధాన్య‌తనివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పార్టిసిపెంట్‌కు స‌హాయంగా ఆడియ‌న్స్‌లో త‌మకు న‌మ్మ‌క‌స్తుణ్ని అందుబాటులో ఉంచ‌డం, ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్ష‌న్‌లో వీడియో కాల్ స‌దుపాయంతో పాటు మ‌రికొన్ని ఇత‌ర మార్పులు చేయ‌నున్నారు.

సెప్టెంబర్ నుండి టీవీల్లో

సెప్టెంబర్ నుండి టీవీల్లో

`కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి9` సోనీ టీవీలో సెప్టెంబ‌ర్‌లో ప్రారంభ‌మై ఆరు వారాల పాటు కేవ‌లం 30 ఎపిసోడ్లుగా ఈ షో ప్ర‌సారం కానుంది. గత షోలతో పోలిస్తే ఇందులో ప్రశ్నల సంఖ్య పెంచుతున్నట్లు సమాచారం.

English summary
Bollywood megastar Amitabh Bachchan is all set to host season 9 of popular game show Kaun Banega Crorepati and we cannot wait for it to start.Amitabh Bachchan has started shooting for the show and shared a few pics from the sets on his Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu