»   » అమితాబ్‌కు గుడికట్టిన ఫ్యాన్స్.. ఫైబర్ విగ్రహానికి పూజలు..

అమితాబ్‌కు గుడికట్టిన ఫ్యాన్స్.. ఫైబర్ విగ్రహానికి పూజలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కోల్‌కోతాలోని ఆలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించి బిగ్ బీపై తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఈ కార్యక్రమం ఆల్ బెంగాల్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేపట్టింది. ఫైబర్ గ్లాస్‌తో విగ్రహాన్ని సుబ్రతా బోస్ అనే శిల్పి రూపొందించారని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. అమితాబ్ నటించిన సర్కార్3 పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ పటోడియా తెలిపారు.

 25 కిలోల బరువు

25 కిలోల బరువు

25 కేజీల బరువు ఉన్న విగ్రహాన్ని బచ్చన్ కోసం కట్టిన గుడిలో ఏర్పాటు చేశాం. బిగ్ బీ నటించిన చిత్రాలు విజయవంతం కావాలని పూజలు చేస్తున్నాం అని సంజయ్ వెల్లడించారు. విగ్రహా ఏర్పాటు కార్యక్రమానికి భారీ ఎత్తున్న అభిమానులు తరలివచ్చారని పేర్కొన్నారు.

ఫైబర్ గ్లాస్..

ఫైబర్ గ్లాస్..

ఆరు అంగుళాల రెండు ఇంచుల ఎత్తుతో, ఫైబర్ గ్లాస్‌తో అమితాబ్ విగ్రహాన్ని తయారు చేయించాం. ఇది అమితాబ్ ఎత్తు కంటే ఎక్కువ. ఈ విగ్రహాన్ని చూస్తే నిజంగా బిగ్ బీని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అని ఆయన అన్నారు.

. సర్కార్3 గెటప్‌లో..

. సర్కార్3 గెటప్‌లో..

అమితాబ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి సర్కార్3లో బిగ్ బీ ధరించిన డ్రస్సుతోపాటు, పలువురు అభిమానులు అదే గెటప్‌లో హాజరయ్యారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సర్కార్3 శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

లక్షరూపాయల ఖర్చుతో..

లక్షరూపాయల ఖర్చుతో..

అక్టోబర్ 11 తేదీన అమితాబ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని తయారు చేయించాం. ఈ విగ్రహం ఖర్చు రూ.1 లక్ష అయింది. అభిమానులమంతా కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని సంజయ్ వివరించారు.

English summary
A life-size statue of the megastar Amitabh Bachchan has been installed at a temple in Kolkata by All Bengal Amitabh Bachchan Fans' Association. "We have installed the 25-kg statue at a temple dedicated to Bachchan after offering prayers for his film's success," ABFA state secretary Sanjay Patodiya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu