»   »  'మర్మయోగి' వర్సెస్ 'రొబో'

'మర్మయోగి' వర్సెస్ 'రొబో'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh Bachan
రజనీ,కమల్ ఇద్దరూ ఆల్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళే. అలాగే ఇద్దరికీ సౌత్ లోనే కాక బాలీవుడ్ మార్కెట్ ని సొంతం చేసుకోవాలన్న ఆశ ఉంది. దాంతో ఎవరి పరిధిలో వాళ్ళు ఎప్పటికప్పుడు పావులు కదుపుతూనే ఉన్నారు. అదిప్పుడు అమితాబ్ దగ్గరకు వచ్చి ఆగింది. బాలీవుడ్ మార్కెట్ ని గెలవాలంటే అక్కడ వారితో సినిమాలు చేయటం బెటరని అభిప్రాయంతో ఉన్నారు. దానికి తగ్గట్లుగానే రజనీ 'రోబో' లో ఐష్ కనిపించనుంది. కమల్ హేమమాలిని, కాజోల్ వంటి వారిని తన 'మర్మయోగి' లోకి తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు ఆయన తన సినిమా కోసం బిగ్ బి ని ఆడిగారుట. మరో ప్రక్క రజనీకాంత్ 'రొబొ' లోనూ ఆయన్ని అడుతున్నారుట. కానీ కమల్ సినిమాకు ఆయన ఓ.కె.చెప్పినట్లు సమాచారం. దాంతో 'దశావతారం' ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతకు రెట్టింపుగా 'మర్మయోగి' మారేటట్లు ఉందని పరిశ్రమలో వార్తలు వినపడుతున్నాయి. ఇక కమల్ 'మర్మయోగి' లో బాగా పూర్వ కాలంలో కథ నడిస్తే ...'రొబో' లో కథ అడ్వాన్సు కాలంలో నడుస్తుంది. ఇద్దరూ ప్రస్తుతాన్ని వదిలేసేటట్లున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X