Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నలుగురు స్టార్ హీరోలతో వర్మ కొత్త చిత్రం 'డిపార్టమెంట్'
అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ రన్ చేస్తూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్..అంటూ తన కొత్త చిత్రానికి డిపార్టమెంట్ అనే పేరు ఎందుకు పెట్టానో రామ్ గోపాల్ వర్మ వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ చిత్రం గురించి మరికొన్ని డిటేల్స్ బయిటకు వచ్చాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్, అమితాబ్ నటించటానున్నారు. అమితాబ్..ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తే..మిగతా ముగ్గురూ...ఎనకౌంటర్ స్పెషలిస్టులుగా కనిపిస్తారు. ఇది ఓ రకంగా 2004 లో వచ్చిన అబ్ తక్ చప్పన్ చిత్రానికి సీక్వెల్ లాంటిదని చెప్తున్నారు. ఇక ఈ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలను కూడా దయానాయక్, విజయ్ సలార్కర్, ప్రదీప్ శర్మ, సచిన్ వేజి ల నిజ జీవితాలనుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందించనున్నారు.
వీరు రకరకాలకుగా అండర్ వరల్డ్ డాన్ లను ఎదుర్కొంటారు. అయితే వీరి మధ్య రకరకాల ఇగోలు,సమస్యలు ఉంటాయి. అవి డిపార్టమెంట్ లో పనిచేసే మిగతా వారిపై పడతాయి. వీటిని సమన్వయపరుస్తూ సిటీని ప్రశాంతంగా ఉంచటానికి అమితాబ్ పాత్ర కృషి చేస్తూంటుంది. ఇక దయానాయక్ పాత్రను..అజయ్ దేవగన్ చేస్తే, సంజయ్ దత్..ప్రదీప్ శర్మ రోల్ ని, అభిషేక్..సచిన్ వేజ్ పాత్రలను పోషిస్తారు. పూర్తి స్ధాయి యాక్షన్ పేకెడ్ గా రూపొందే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతోంది..అంతకు మించి ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించలేనంటున్నారు వర్మ.
ఈ చిత్రం గోవింద నిహలానీ అర్ధ సత్య తరహాలో ఉంటుందని, పోలీస్ డిపార్టమెంట్ లోని లోటు పాట్లని కాస్త లోతుగానే తన దైన శైలిలో ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది. ఈ దేశంలోని లా పోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాన్ని ఎక్సపోజ్ చేస్తున్నాని చెప్తున్నారు. ఇక అంతర్గత సమాచారం ప్రకారం కంపెనీ చిత్రం చేస్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందని, మాఫియా మాదిరిగానే పోలీస్ డిపార్టమెంట్ లోపల ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుందని అదే యుఎస్ పి గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈచిత్రంలో పోలీస్ ఎనకౌంటర్ కిల్లింగ్స్ దగ్గరనుంచి, మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లు దాకా ఈ చిత్రంలో చర్చించనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం వర్మ...సునీల్ హీరోగా రూపొందుతోన్న అప్పలరాజు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.