»   » బూతు సినిమానా?(ఫోటోలు చూస్తే తెలియట్లా!)

బూతు సినిమానా?(ఫోటోలు చూస్తే తెలియట్లా!)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సిద్ధార్థ్‌వర్మ, విజయ, మధు, తేజ, అశ్వి, మనస్విని, సుశ్మిత ప్రధాన పాత్రధారులుగా సుజాతా ఆర్ట్స్ పతాకంపై అంజి శ్రీను దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం 'అమ్మా నాన్న ఊరెళితే'. తాజాగా విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అనేక అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి.

సినిమాలోని తారల మధ్య శృతి మించిన రొమాన్స్ ఉండటం చూస్తుంటే సినిమాలో బూతు సన్నివేవాలు ఎక్కువ ఉన్నాయనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే యూనిట్ సభ్యులు మాత్రం సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుందని అంటున్నారు.

ఫోటోలు ఇంత ఘాటుగా ఉండటాన్ని బట్టి చూస్తే యువతను ఆకట్టుకునేందుకు పబ్లిస్టంటుగా వీటిని విడుదల చేసినట్లు స్పష్టం అవుతోంది. స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

ఆడియో విడుదలైంది

ఆడియో విడుదలైంది


ఈ చిత్రానికి సంబంధించిన సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడెకరాల స్థలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో శ్రీహరి ఆడియో సీడీ విడుదల చేశారు.

శ్రీహరి మాట్లాడుతూ

శ్రీహరి మాట్లాడుతూ


అమ్మా నాన్న ఊరెళితే ప్రైవసీ ఉండటంతోపాటు బాధ్యత కూడా ఉంటుందనే విధంగా ఈ చిత్రముంటుందని, దర్శకుడు ఆ విధంగానే తెరకెక్కించాడని భావిస్తున్నాను అని శ్రీహరి తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ

దర్శకుడు మాట్లాడుతూ


నలుగురు కొత్త జంటలతో ఈ చిత్రం సాగుతుందని, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో యువతను ఆకట్టుకునేలా రూపొందించామని, పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు.

సంగీత దర్శకుడు

సంగీత దర్శకుడు


సంగీత దర్శకుడు మున్నా కాశి మాట్లాడుతూ- పూర్తి స్వేచ్ఛనిచ్చి దర్శక నిర్మాతలు మంచి పాటలను రాబట్టుకున్నారని తెలిపారు.

నటీనటులు, సాంకేతిక విభాగం

నటీనటులు, సాంకేతిక విభాగం


శివకృష్ణ, ఎఫ్.ఎం.బాబాయ్, సంధ్యా జనక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:మున్నా కాశి, కెమెరా:ఖాదర్, పాటలు:పోతుల రవికిరణ్, శ్రీరామ్ తపస్వి, ఎడిటింగ్:కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాత:జక్కుల నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను.

English summary
‘Amma Nanna Oorelithe’ stars Sonia Agarwal in special role and Siddharth Varma, Shilpa Sri Madhu, Sushmitha, Vijay, Tanusha, Teja and Manaswini in other prominent roles. Director Anji Sreenu said, “Amma Nanna Oorelithe is the story of a four young couple. The film has lot of entertainment in it.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu