»   » తండ్రిగా నేనూ ఎదురు చుస్తున్నా: కూతురు సినిమా ప్రవేశం పై పెదవి విప్పిన హీరో

తండ్రిగా నేనూ ఎదురు చుస్తున్నా: కూతురు సినిమా ప్రవేశం పై పెదవి విప్పిన హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కూతురు సారాఅలీఖాన్‌ సినీప్రవేశంపై తాను, సారా తల్లీ, తన మాజీ భార్య అమృతాసింగ్‌ ఒకే అభిప్రాయంతో ఉన్నామని, ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలకు తావు లేదని బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ చెప్పాడు. ఈ విషయంలో తనకు, అమృతాసింగ్‌ మధ్య గొడవ జరిగిందంటూ వచ్చిన కథనాలు అన్నీ నమ్మవద్దనీ, అవన్నీ కేవలం పుకార్లేననీ చెప్పేసాడు.

సారా అలీఖాన్

సారా అలీఖాన్

బాలీవుడ్ ఖాన్స్‌లో ఒక‌డైన సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గత సంవత్సర కాలంగా వార్తల్లో నానుతూనే ఉంది. అద్బుతమైన అందం తో మెరిసి పోయే సారా ఆలి ఖాన్ ఎప్పుడెప్పుడు తెరమీద కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా.

హృతిక్ తో న‌టించ‌బోతోందీ అంటూ

హృతిక్ తో న‌టించ‌బోతోందీ అంటూ

పోయిన ఏడాదే సారా హీరోయిన్‌గా అరంగేట్రం చేయ‌బోతోందీ, హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న ఆమె న‌టించ‌బోతోందీ అంటూ వార్త‌లు వచ్చాయి. దానికి ముందు టైగ‌ర్ ష్రాఫ్ లీడ్ రోల్‌లో వ‌స్తున్న‌ క‌ర‌ణ్‌జోహార్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 మూవీతో సారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు కూడా మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి.

మాజీ భార్య అమృతాసింగ్

మాజీ భార్య అమృతాసింగ్

అయితే సారా ఎంట్రీకి ఇది స‌రైన మూవీ కాద‌ని ఆమె త‌ల్లి, సైఫ్ మాజీ భార్య అమృతాసింగ్ చెప్ప‌డంతో అది కాస్తా సైడైపోయింది. ఆతర్వాత అప్పుడప్పుడు వచ్చే కొన్ని రూమర్లే తప్ప అసలు సారా ఎప్పుడు తెరమీదకి వస్తుందో తెలియటం లేదు. ఇదిగో అదిగో అన్న వార్తలు తప్ప

విభేదాలు వచ్చాయని

విభేదాలు వచ్చాయని

అయితే, సారా బాలీవుడ్‌ ఎంట్రీపై తండ్రి సైఫ్‌ ఆందోళన చెందుతున్నాడని, తల్లి అమృతాసింగ్‌ సరా సినిమాల్లోకి రావాలని కోరుకుంటుండగా.. ఇందుకు సైఫ్‌ నిరాకరించారని, దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఖండిస్తూ సైఫ్‌ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఒకే అభిప్రాయంతో ఉన్నాం

ఒకే అభిప్రాయంతో ఉన్నాం

‘సారా సినీ ప్రవేశంపై నేను, అమృత ఒకే అభిప్రాయంతో ఉన్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి సంభాషణ జరుపలేదు. నటించాలన్న సారా అభిమతానికి నేను పూర్తి మద్దతు ఇచ్చాను. ఆమెతో సవివరంగా చర్చించాను. ఓ తండ్రిగా ఆతృతతో, మిశ్రమ భావోద్వేగంతో ఆమె సినీ రంగ ప్రవేశం గురించి ఎదురుచూస్తున్నాను' అని సైఫ్‌ చెప్పాడు.

కొలంబియా యూనివ‌ర్సిటీ

కొలంబియా యూనివ‌ర్సిటీ

న్యూయార్క్‌లోని కొలంబియా యూనివ‌ర్సిటీలో ఈ మ‌ధ్యే త‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకుంది సారా అలీ ఖాన్‌. ఈ మ‌ధ్య బ‌చ్చ‌న్స్ ఇచ్చిన పార్టీలో డిజైన‌ర్స్ అబుజానీ-సందీప్ ఖోస్లా రూపొందించిన బ్లూడ్రెస్‌లో సారా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. సారాకు సినిమాల‌పై ఆస‌క్తి ఉంద‌ని గ‌తంలోనూ సైఫ్ చెప్పాడు.

English summary
Saif Ali Khan said in a statement on Wednesday that “it’s annoying to read totally fictitious media reports” about him having a disagreement with Amrita over Sara’s debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu