»   » రామ్ చరణ్ వల్లే పెరిగిందంటున్న లండన్ పాప!

రామ్ చరణ్ వల్లే పెరిగిందంటున్న లండన్ పాప!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా 'ఎవడు'లో లండన్ బ్యూటీ అమీ జాక్స్ కూడా నటించిన సంగతి తెలిసిందే. తను నటించిన తొలి తెలుగు సినిమా విజయం సాధించడంపై అమీ జాక్సన్ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

'రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఇక డాన్సులైతే ఇరగదీసాడు. అలాంటి గ్రేట్ డాన్సర్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కింది. అతను నిజంగా రియల్ స్టార్. రామ్ చరణ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం వల్ల నాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది' అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.

Amy Jackson about Ram Charan

దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతూ....దర్శకుడు నా క్యారెక్టరైజేషన్ అద్భుతంగా మలిచారు. కేవలం డాన్సులు, గ్లామర్‌కే పరిమితం కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసాను అనే సంతృప్తి కలిగింది. ఎవడు సక్సెస్ నాలో కాన్ఫిడెన్స్ బాగా పెంచింది. సినిమాను గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను' అన్నారు.

రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది.

English summary
Yevadu movie actress Amy Jackson praises her co-star Ram Charan. She says Ram Charan is real super star. Yevadu is a 2014 Telugu action film written and directed by Vamsi Paidipally. The film stars Ram Charan Teja, Shruti Haasan and Amy Jackson in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu