»   » ఇంత డిమాండా....!? అమీ జాక్సన్‌ రేటు ఆరు నిమిషాలకి రూ. కోటి

ఇంత డిమాండా....!? అమీ జాక్సన్‌ రేటు ఆరు నిమిషాలకి రూ. కోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు పెద్ద సినిమాల్లో నటిస్తూ... నిర్మాతగా చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా ఫారిన్ బ్యూటీ అమీ జాక్సన్ కూడా అదే బాటలో పయనించబోతోందని సమాచారం. ప్రస్తుతం 'రోబో' సీక్వెల్‌గా తెరకెక్కుతున్న '2.0'లో హీరోయిన్‌గా నటిస్తున్న అమీ జాక్సన్... మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. పనిలో పనిగా ఓ షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా వ్యవహరించేందుకు అమీ సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తక్కువ బడ్జెట్‌లో షార్ట్ ఫిల్మ్స్‌ను తెరకెక్కించి వాటిని క్యాష్ చేసుకునే ఆలోచనలో అమీ జాక్సన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. తన సంపాదనను కొత్త ఇళ్ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్న ఫారిన్ బ్యూటీ... షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న '2.0' వంటి సినిమాలో నటిస్తున్న అమీ జాక్సన్... తన షార్ట్ ఫిల్మ్‌తో మ్యాజిక్ చేస్తుందేమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే...

Amy Jackson to perform at IPL opening

అదంతా పక్కన పెడితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్తన్యూస్ మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంది.'రోబో 2.0' విడుదల కూదా కాకుండానే అమీ రేటు ఒక రేంజ్ లో పెరిగిపోయింది... ఈ చిత్రం రిలీజ్‌ తర్వాత ఆలిండియాలో తన డిమాండ్‌ పదింతలు అవుతుందని ఆమె కాన్ఫిడెంట్‌గా వుంది. కుర్రకారులో తనకి వున్న ఫాలోయింగ్‌ గుర్తించి ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ కి అమీ జాక్సన్‌ని తీసుకున్నారు. ఆరంభ కార్యక్రమాల్లో అమీ ఒక బాలీవుడ్‌ మెడ్లీ పర్‌ఫార్మ్‌ చేస్తుంది.

ఐపీఎల్‌ పదో సీజన్‌ బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు ముందు, ఉప్పల్‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు అదిరిపోయే రీతిలో సాగనున్నాయి. అరగంట పాటు ఆరంభోత్సవం ఉంటుంది. సాయంత్రం 6.20కి దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లు గోల్ఫ్‌ కార్ట్‌ లలో మైదానంలోకి ప్రవేశిస్తారు.

దిగ్గజాల ఘనతలను కీర్తిస్తూ ఆడియో, వీడియో ప్రదర్శించాక సన్మానం ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు.ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. క్రికెటర్లకు సన్మానం అనంతరం బాలీవుడ్‌ నటి అమీ జాక్సన్‌ 300 మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన ఇవ్వనుంది. ఆరు నిమిషాల పాటుండే ఈ కార్యక్రమం కోసం అమీకి కోటి రూపాయలు చెల్లించినట్టు భోగట్టా.

English summary
Amy Jackson will be performing at the opening ceremony of Indian Premier League reports Mid-Day. The six-minute performance will see her dancing to Tamma Tamma from the recently released Alia Bhatt and Varun Dhawan starrer Badrinath Ki Dulhania
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu