»   » హీరోయిన్ తండ్రికి హార్ట్ ఎటాక్

హీరోయిన్ తండ్రికి హార్ట్ ఎటాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విక్రమ్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' చిత్రంతో పాపులరైన అమీ జాక్సన్ తండ్రి అలెన్ జాక్సన్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన లండన్ లో ఉన్నారు. ఇండియాలో విఐపీ 2, రఘువరన్ బిటెక్ సీక్వెల్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న అమీ తండ్రిని చూడటానికి లండన్ వెంటనే వెళ్లిపోయింది.

అమీకు తొలి నాటి నుంచీ తండ్రి అంటే విపరీతమైన ఆపేక్ష. తన తండ్రితోనే ప్రతి విషయం ఆమె పంచుకుంటుంది. ఫాధర్స్ డే సందర్భంగా ఆమె తన తండ్రితో దిగిన ఫొటోని షేర్ చేసి,..మేము మా కుటుంబం లేకుండా లేము..లవ్ యు డాడ్..నువ్వు లేకపోతే మేం లేము...నువ్వు మాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రాసుకొచ్చింది. అలా రాసిన రెండు రోజుల తర్వాత ఇలా..హార్ట్ స్ట్రోక్ రావటం భాధాకరమే మరి. ఆయన త్వరగా కోలుకోవలాని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

కెరీర్ విషయానికివస్తే..

ఇప్పుడు హాట్ గా ఉండే హీరోయిన్ ఎవరూ అంటే తడుముకోకుండా చెప్పే పేరులా మారింది అమీ జాక్సన్ ది. ఆమె 'ఐ' చిత్రంలో చేసిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టీని ఆకర్షించింది. ఆమెకు వరస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె చాలా సంతోషంగా ఉంది ఈ పరిణామంతో.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Amy Jackson’s Father suffers Heart Attack

అమీ జాక్సన్ మాట్లాడుతూ... 'శివతాండవం'లో తొలిసారి విక్రమ్‌ సరసన నటించే అవకాశం. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన అవకాశం వచ్చింది. నేను అది వరకు చేసినవి చాలా సీరియస్‌ పాత్రలు. ఇందులో కొంత కామెడీ ఉంది, జాలీగా అనిపిస్తుంది. ఒప్పుకున్నాను. అప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. తెలుగు రాకపోయినా.. హైదరాబాద్‌ చాలా నచ్చేసింది. ఆ చిత్రం ముగుస్తుండగానే శంకర్‌ నుంచి 'ఐ' పిలుపొచ్చింది.

ఆరోజు ఎగిరి గంతేసినంత పనిచేశా. ఒకే చిత్రంలో నలుగురు గొప్ప కళాకారులు.. శంకర్‌, పీసీ శ్రీరామ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌, విక్రమ్‌తో పనిచేసే అవకాశం వచ్చిందంటే.. ఐ యామ్‌ లక్కీ కదా! మామూలుగా శంకర్‌ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా పనుండదని అంటారు. కానీ ఇది వేరు. ఇదో లవ్‌ థ్రిల్లర్‌ అనొచ్చు. నా జీవితంలో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే ఇదొక్కటే ఒకెత్తు. ఈ ఒక్క చిత్రానికే రెండేళ్లు తీసుకున్నాను. ఆ కష్టం వృథా పోలేదు. ఆడియో వేడుకలో శంకర్‌, విక్రమ్‌ ప్రశంసలు నా జీవితంలో మరవలేనివి. ఆ మాటలకు ఎంత ఐసైపోయానో చెప్పలేను అన్నారు.

Amy Jackson’s Father suffers Heart Attack

ఇక భారత్‌కి వచ్చాక ఇక్కడి సంస్కృతినీ, భాషనీ అర్థం చేసుకోవడం కష్టమే అయినా పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు. నేను తీవ్రంగా బాధపడ్డ అంశాలు వేరే ఉన్నాయి. నా రెండో చిత్రం నుంచే ఒక్కసారిగా నన్ను పుకార్లు చుట్టుముట్టాయి. మొదట్లో చాలా బాధపడ్డా. పట్టించుకోవడం మానేశా. నేను కేవలం మోడల్‌నయితే ఇలాంటివి వచ్చి ఉండకపోవచ్చుగానీ... సినిమా అన్నాక తప్పదు కదా అని సర్ది చెప్పుకున్నా అన్నారామె.

అలాగే...కానీ గాసిప్స్‌కంటే నా మనసుని కలచివేసిన అంశం మరొకటుంది. 'ఈ తెల్లమ్మాయి మనదేశంలో పని చేయడమేమిటీ.. మనకెవరూ లేరా.. ఈ దేశం గొడ్డుబోయిందా!' అన్న గగ్గోలు మొదలైంది. ఈ దేశాన్ని రెండో పుట్టిల్లుగా భావిస్తున్న నాకవి చెంపపెట్టులా తగిలాయి. చాలా బాధపడ్డా. కానీ అవి చేసేవాళ్లు కొందరేననీ... ఇక్కడి సామాన్యులు దేశం, మతం, జాతులకతీతంగా అందర్నీ అక్కున చేర్చుకోగలరని అర్థమైంది. భారత్‌ గొప్పతనం అదే! అందుకే ఈ దేశాన్ని నేనింతగా ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు.

English summary
Alan Jackson, the father of Amy Jackson, suffered a Heart Attack in London. The Actress who is currently shooting for 'VIP 2' which is a sequel of 'Raghuvaran B.Tech' in Chennai rushed to her country immediately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu