»   » నకిలీ రోబో రజినీ తో అమీజాక్సన్ ఫోజు: రియల్ రజినీ కోసం ఎదురు చూపు

నకిలీ రోబో రజినీ తో అమీజాక్సన్ ఫోజు: రియల్ రజినీ కోసం ఎదురు చూపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వెల్‎గా '2.0' సినిమా తెరకెక్కుతోంది. అత్యంత భారీబడ్జెట్‎తో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇందులో రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్‎గా నటిస్తోంది. తాజాగా అమీజాక్సన్‎పై వచ్చే సన్నివేశాలను షూట్ చేసేందుకు సిద్ధమైంది శంకర్ యూనిట్. దీంతో సెట్స్‎పై అడుపెట్టబోతున్న అమీజాక్సన్ డైరెక్టర్ శంకర్ ఆఫీస్ లో 'రోబో రజినీ' తో ఫోటో దిగి అభిమానులతో షేర్ చేసుకుంది.

Leaked : Amy Jackson Posted Hot Photo, Viral in Social Media - Filmibeat Telugu

రోబో 2.0 దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చివరి దశలో ఉన్నాయి. అలాగే సినిమాలో సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత హీరోయిన్ అమీ జాక్సన్ చిత్ర యూనిట్ తో కలవనుంది. సినిమాలోని మొదటి పాట కు రెడి అవ్వబోతున్నట్లు తెలిపింది. రీసెంట్ ఆమె శంకర్ ఆఫీస్ లో ఉన్న రజినీకాంత్ కృత్రిమ రోబో తో ఒక ఫోటోకి స్టీల్ ఇచ్చింది. రోబో సినిమా కోసం శంకర్ ఎన్నో రోబోలను తయారు చేయించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ వాటిలో ఒకదాన్ని తన ఆఫీస్ లో ఇలా ఉంచుకున్నాడట. ఇక రజినీకాంత్ తో రియల్ స్టెప్స్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటోంది అమీ.

 Amy Jackson With Rajinikanth in Shankar Office

దాదాపు 10 రోజుల వరకు ఆ సాంగ్ ని చిత్రీకరిస్తారట. అంతే కాకుండా ఆ సాంగ్ లో ఒక స్పెషల్ ఏంటంటే.. మైకేల్ జాక్సన్ కి ఆ పాటకి కొంచెం కనెక్షన్ ఉందట. శంకర్ ఊహలకు తగ్గట్టుగా ఒక అద్భుతమైన సెట్ లో సాంగ్ ఉంటుందని టాక్. ఇక ఏఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

English summary
Amy posted a photography with artificial Robo-Rajini sitting in Shankar's office and commented she cannot wait to dance with real one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu