»   »  ఎన్టీఆర్-కొరటాల సినిమాలో ఆ హీరోయినా?

ఎన్టీఆర్-కొరటాల సినిమాలో ఆ హీరోయినా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'శ్రీమంతుడు' ఘన విజయంతో మంచి జోరు మీద ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో ప్లాన్ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ గా అమైరా దస్తూర్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె ఆడిషన్స్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఫైనల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇంతకు ముందు ఆమైరా దస్తూరు ధనుష్ నటించిన ‘అనేకుడు', ఇమ్రాన్ హస్మి ‘మిస్టర్ ఎక్స్' చిత్రాల్లో నటించింది.

Amyra Dastur for NTR Next?

మరో వైపు ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్న టైటిల్ ఒకటి బయిటకు వచ్చింది. ఆ టైటిల్ ఏమిటంటే..."జనతా గ్యారేజ్", ట్యాగ్ లైన్ " అన్ని రిపేర్ చేయబడును". ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి మాస్ గా మెకానిక్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సాగే ఈ కథలోనూ అంతర్లీనంగా సెంటిమెంట్ తో కూడిన సమాజిక సందేశం ఉందని చెప్పుకుంటున్నారు. అలాగని యాక్షన్ పార్ట్ కు ఎక్కడా లోటు రానివ్వని విధంగా స్క్రిప్టు డిజైన్ చేసాడంటున్నారు. ఇక ఈ టైటిల్ అధికారికంగా ప్రకటించింది కాదు..కేవలం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతున్న వర్కింగ్ టైటిలే.

నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది.

English summary
Film Nagar source said that,Amyra Dastur for NTR-Koratala Shiva's Next. Amyra Dastur is said to have recently given auditions, although official reports are still to be announced.
Please Wait while comments are loading...