»   » హీరోని చూడటం కోసం 42 రోజులు కాలినడకన...

హీరోని చూడటం కోసం 42 రోజులు కాలినడకన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తన అభిమాన నటుడిని చూడాలనే ఆశయంతో హర్యానా నుంచి కాలినడకన ముంబయికి చేరుకుని ఎట్టకేలకు ఆ నటుడిని కలుసుకున్న ఓ అభిమాని ఉదంతమిది. సదరు అభిమాని ముంబయికి చేరుకోగానే ఆ నటుడు అక్షయ్‌కుమార్‌ విదేశాల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని గార్డుల ద్వారా తెలుసుకున్న అభిమాని తన అభిమాన నటుడు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు.

అక్షయ్‌కుమార్‌ ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై వారంరోజులు అక్కడే పడుకొని అక్షయ్‌ కోసం నిరీక్షించసాగాడు. తమ ఇళ్ళ ఎదుట ఎవరో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్నారన్న విషయాన్ని ఇరుగుపొరుగువారు సేకరించారు. హర్యానా నుంచి 42 రోజుల పాటు కాలినడకన ముంబయికి చేరిన ఆ అభిమాని గురించి తెలుసుకున్న ఇరుగుపొరుగువారు అతనికి సహాయపడ్డారు. కొందరు పొరుగువారు అతనికి దుప్పట్లు, ఆహారం అందించారు.

Akshay Kumar

ఈ విషయం తెలుసుకున్న అక్షయ్‌కుమార్‌ తల్లి సదరు యువకుడిని కలసి అక్షయ్‌ రాగానే మాట్లాడిస్తానని హామీఇచ్చింది. విదేశీయాత్ర నుంచి తిరిగివచ్చిన అక్షయ్‌ కుమార్‌ విషయం తెలుసుకొని అభిమానిని కలుసుకున్నారు. ఎందుకు ఇక్కడకు వచ్చావని అక్షయ్‌ ప్రశ్నించగా తాను హర్యానాలోని పేద కుటుంబం నుంచి వచ్చానని, ముంబయికి వచ్చేందుకు రైలు టిక్కెట్‌ కొనే స్థోమత తన వద్ద లేదన్నారు.

దీంతో తాను ప్రతినిత్యం నడుచుకుంటూ జాతీయ రహదారిపై ఉన్న దాబాల్లో పనిచేస్తూ ఆహారం సంపాదించుకునేవాడినని తెలిపాడు. తిరుగుప్రయాణం కోసం అక్షయ్‌కుమార్‌ అతనికి కొంత డబ్బిచ్చి హర్యానా వెళ్ళి తల్లిదండ్రులతో హాయిగా జీవితం వెళ్ళదీసుకోవాలని సూచించాడు.

English summary

 When Akshay Kumar returned to Mumbai from a brief holiday in Casablanca last week, he heard from his staff about a young lad staying outside his building for the last few days. He learnt that the chap came to meet him from outside Mumbai and had refused to leave when told that he was not in the country. He slept on the road outside the Khiladi’s building and made it clear he had no intention of leaving till he had accomplished his mission of meeting the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu