»   » జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి తుపాకీతో ఆగంతకుడు..పోలీస్ ఎలెర్ట్

జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి తుపాకీతో ఆగంతకుడు..పోలీస్ ఎలెర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో నివాసం ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి చేతిలో తుపాకీ ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోనికి వెళ్లాడు.

అలికిడి కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అటువైపుగా రావడంతో.. గమనించిన అగంతకుడు అక్కడ్నుంచి పారిపోయాడు. అగంతకుడు నెంబర్‌ప్లేట్ లేని వాహనంపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనంతా సమీపంలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రభస చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.ఎన్.టి.అర్, అందాల భామ సమంత కలిసి నటిస్తున్న కొత్త సినిమా రభస. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బాధ్షా లో.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించిన ఆయన రాబోయే రభస చిత్రం లో కూడా చాలా విభిన్నంగా కనిపించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రిపేరవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ చిత్రంలో ఆయన ప్లే బోయ్ గా కనిపించనున్నారు కూడా.

English summary
An unknown person covered over face intruded into the house of jr.NTR, he tried to enter into the house with a gun. This incident took place in the area of Jubilee Hills police station. In the Jubilee Hills road number 37, Mahesh Babu has got his house. On Sundayday night, an unknown person jumped over compound wall and covered the eyes of security people. With this alert security guards rushed to the main door and tried to catch the thief but he escaped from back door by then. Jr.NTR came out and inquired about the incident. Later security guards lodged complaint in Jubilee Hills Police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu