ఆ భయమే నయనతారను ఆలోచనలో పడేసిందా?

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ నయనతార శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'అనామిక' చిత్రం మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సినిమాలో ప్రధాన పాత్రదారి అయిన నయనతార సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం ఇపుడు చర్చనీయాంశం అయింది. ఇటీవల విడుదలైన ఆడియో వేడుకకు కూడా నయన తార హాజరు కాలేదు. దీంతో నయనతారపై పరిశ్రమ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి.

ప్రభుదేవాతో విడిపోవడానికి ముందు నయనతారపై ఓ రిమార్కు ఉండేది. అప్పట్లో ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుని సినిమాల్లో నటించేది కానీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేది. అయితే ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత నయనతారలో చాలా మార్పు వచ్చిందని, ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుందని పలువురు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేసారు.

Anaamika team requesting Nayanthara

కానీ మళ్లీ నయనతార గతంలో మాదిరి ప్రమోషన్లకు దూరంగా ఉంటూ నిర్మాతలను టెన్షన్ పెడుతుండటంతో ఆమె తీరును అందరూ తప్పుబడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు ఇపుడు నయనతార చెవిలో కూడా పడ్డాయి. రేపు సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితలు సాధించక పోతే అంతా తననే ఆడిపోసుకుంటారనే విషయం గ్రహించిన నయనతార ఇక ప్రమోషన్లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంత తక్కువ సమయంలో నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకు ఏ విధంగా న్యాయం చేస్తుందో చూడాలి.

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. 'U/A'సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 1న విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X