»   »  ‘అనగనగా ఓ ధీరుడు’ ట్రైలర్ విడుదల ...రాజమౌళి స్పందన

‘అనగనగా ఓ ధీరుడు’ ట్రైలర్ విడుదల ...రాజమౌళి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్దార్ధ్, శృతి హాసన్, లక్ష్మీమంచు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన 'అనగనగా ఓ ధీరుడు" చిత్ర ట్రైలర్‌ను శనివారం సినీ మాక్స్‌లో మీడియాకు ప్రదర్శించారు. ఈ చిత్రం ట్రైలర్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ రేంజిలో ఉండటంతో చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ...''ఈ సినిమా కథ తెలుసు. ప్రకాష్‌ ఎలా తీయాలనుకొన్నాడో తెలుసు.అయితే అవన్నీ చూసినా ఈ స్ధాయిలో సినిమా తీస్తాడని ఊహించలేకపోయాను. ఇక ఈ చిత్రం ట్రైలర్స్ చూస్తే.. నా ఊహలకు అందనంత బాగా తీశాడు. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాగే అంతర్జాతీయ స్ధాయిలో తీసిన ఈ సినిమా వల్ల తెలుగు పరిశ్రమకు అడ్వాంటేజ్ అవుతుంది. వాల్ డిస్నీ వారు సినిమా వ్యాపారాన్ని ఎన్నో విధాలు చేయటం వల్ల ఆదాయం చాలా రకాలుగా వస్తుంది. తెరపై శృతి,సిద్దార్ధల కెమిస్ట్రీ బాగుంది. సినిమాలో లక్ష్మి ప్రసన్న చాలా బాగా చేసింది. లక్ష్మి ఇలా చేసింది అని ఊహించని విధంగా తన ప్రతిభను ప్రదర్శించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తున్నదని నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత డా.రామానాయుడు మాట్లాడుతూ 'రాఘవేంద్రరావు కుటుంబానికి, మా సంస్థకు ఎంతో అనుబంధం ఉంది.రానా, ప్రకాష్ క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్లద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రావాలని కోరుకుంటున్నాను. సినిమా ట్రైలర్స్ అద్భుతంగా ఉన్నాయి. మంచు లక్ష్మి ఇంత మంచి నటి అని నాకు ఇప్పటివరకూ తెలీదు' అన్నారు.'ఈ చిత్రకథ విన్నాను. సెట్స్ స్కెచ్‌లు చూశాను. అయితే ట్రైలర్ ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేకపోయాను.

వాల్ట్ డిస్నీ ప్రతినిధి మహేష్ సామంత్ మాట్లాడుతూ ' 80 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వాల్ట్‌డిస్నీ సంస్థ తొలిసారిగా దక్షిణాదిన కె.రాఘవేంద్రరావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. సినిమా వైవిధ్యంగా ఉంటుందని ట్రైలర్ చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది' అన్నారు.

షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న సిద్దార్థ్ పంపిన వీడియో సందేశంలో... 'శృతి హాసన్, లక్ష్మితో నటించడం నా అదృష్టం. ప్రకాష్ అద్భుతంగా చిత్రాన్ని రూపొందించారు. హై స్టాండర్డ్స్‌లో ఉన్న గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.

ఇక ఈ చిత్రం కథ..అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది.

ఇక ఈ ట్రైలర్ ఈ లింక్ లో చూడొచ్చు...http://www.youtube.com/watch?v=1bX-79ZHggE

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu