For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎందరో మహానుభావులు..

  By Staff
  |

  కొన్ని పాత్రలను తలచుకుంటే అందులో ఫలానా నటుడయితేనే సరిగ్గా సరిపోతారనిపిస్తుంది, ఇంకొక్కల్ని ఆ పాత్రలో ఊహించుకొలేము. వారికోసమే ఈ పాత్రలు పుట్టాయా అనిపిస్తుంది. వారు తప్ప ఇంకొకల్లు ఆ పాత్రను చెయ్యలేరనిపిస్తుంది. దీనికి కారణం ఆయాపాత్రల్లో వారు అజరామరంగా నటించడమే. అలాంటి పాత్రలు పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో ఎన్నో ఉన్నాయి.

  శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడిగా 'ఎన్టీఆర్', ప్రేమదాసుడు, భక్తుడిగా 'ఎఎన్నార్', జేమ్స్ బాండ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకి 'కృష్ణ', ఘటోత్కచుడు, మాయల మాంత్రికుడిగా 'ఎస్.వి.రంగారావు', సీతగా 'అంజలీ దేవీ', సత్యభామగా 'జమున', శశిరేఖ, ఉత్తమ ఇల్లాలి పాత్రలకు 'సావిత్రి', గయ్యాలి అత్తగా 'సూర్యకాంతం', యముడిగా 'సత్యనారాయణ', ఆదర్శవంతమైన భర్తగా 'శోభన్ బాబు', శకునిగా 'సియస్ఆర్'.. ఇలా ఆయా పాత్రలు వారికోసమే పుట్టాయా అన్నట్టుగా రక్తికట్టిచి, మెప్పించారు.

  మాయాబజార్, శ్రీ కృష్ణపాండవీయం, నర్తనశాల వంటి చిత్రాలు చూసాకా శ్రీ కృష్ణుడంటే ఇలాగే వుంటాడా అనిపించేలా ఆ పాత్రలో జీవించారు 'శ్రీ నందమూరి తారకరామారావు' గారు. అలాగే లవకుశ, సంపూర్ణ రామాయణం లాంటి సినిమాలతో శ్రీ రాముడిగా కూడా మెప్పించారు. ఇక దుర్యోధనుడిగా, రావణాసురుడిగా అయితే ఆయనకి ఆయనే సాటి అనిపించుకున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే 'ఎన్టీఆర్' మొదటి సారి 'సొంత ఊరు' సినిమా కోసం కృష్ణుడి వేషం వేసినపుడు అందరూ పెదవి విరచినవారే. కానీ ఆ తర్వాత 'మాయాబజార్' సినిమాలో ఆయన నటనకి నీరాజనాలు పట్టారు.

  ఇక భగ్నప్రేమికుడిగా, భక్తుడిగా 'ఎఎన్నార్' ను మించిన వారెవరూ లేరనే చెప్పాలి. దేవదాసు సినిమా ఎఎన్నార్ నటజీవితాన్నే మలుపు తిప్పింది. అసలు తమిళనాట అయితే ఎఎన్నార్ ను అసలు పేరుతో కాక దేవదాసనే పిలిచేవారు. 'ప్రేమ్ నగర్', 'ప్రేమాభిషేకం', 'మనసు-మాంగల్యం' లాంటి విషాదగాధల్లో ఎఎన్నార్ ఇమిడివోయారని చెప్పచ్చు. అలాగే ఎన్టీఆర్ దేవుడి పాత్రలు చేయడంలో దిట్ట అయితే, ఎఎన్నార్ కు భక్తుడిగా నటించడం అందవేసిన చెయ్యి అని. దానికి తగ్గట్టుగానే అక్కినేని 'విప్రవ నారాయణ', 'భక్త తుకారాం' లాంటి సినిమాలతో భక్తుడిగా మెప్పించారు.

  అలాగే రావణాసురుడిగా, ఘటోత్కచుడు, మాయల మాంత్రికుడిగా ఎస్వీఆర్ అందరిమన్ననలూ పొందారు. మాయాబజార్, పాతాళభైరవి లాంటి సినిమాల్లో ఎస్వీఆరే నిజమైన కథానాయకుడని చాలా మంది అభిప్రాయం. అంతలా ఆయన నటన ప్రభావితం చేసింది. ఆ తర్వాత కైకాల సత్యనారాయణ కూడా రావణాసురుడిగా, ఘటోత్కచుడు నటించినా ఎస్వీఆర్ ను అనుకరించినట్టు అనిపిస్తుంది. కానీ 'యముడి' పాత్రలో ఆయన నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 'యముండ' అంటూ ఆయన పలికించిన హావభావాలు మరెవ్వరూ చూపించలేరనడంలో అతిశయోక్తి లేదు.

  అలాగే కత్తుల వీరుడిగా, నారదుడిగా కాంతారావుకు వచ్చినంత పేరు మరెవ్వరికీ రాలేదని చెప్పచ్చు. మాయాబజార్ సినిమాని తలచుకోగానే మనందరికీ గుర్తొచ్చే పాత్ర శశిరేఖ. ఈ పాత్రలో మహానటి సావిత్రి నటన అజరామరం. అలాగే మిస్సమ్మ, గుండమ్మకథ, నర్తనశాల వంటి చిత్రాల్లో సావిత్రిని కాక ఇంకెవ్వరినీ ఊహించుకోలేము. 'సత్యభామ'గా పొగరు, ఆత్మామిభిమానం కలగలిపి నటించడం ఒక్క 'జమున' కే చెల్లింది. రుక్మిణిగా, సీతగా 'అంజలీ దేవీ' తన నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది.

  అలాగే గయ్యాలి గంపగా కోడల్ని రాచిరంపాన పెట్టే పాత్రల్లో సూర్యకాంతాన్ని మించిన వారు ఇంకొకరు లేరని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎవరైనా గయ్యాలిని చూడంగానే సూర్యకాంతం గారితో పోల్చుతున్నారంటే ఆవిడ ఆ పాత్రల్లో ఎంతగా మెప్పించిందో అర్థంచేసుకోవచ్చు. మన తెలుగు చిత్రసీమ జేమ్స్ బాండ్ ఎవరంటే టక్కున 'కృష్ణ' అని చెప్పేంతలా ఆయన పాపులర్ అయ్యారు. అలాగే అల్లూరి సీతారామరాజు పాత్రలో కూడా ఆయన నటన అభినందనీయం.

  ఇలా ఎందరో మహా నటులు వారి నటనతో ఆయా పాత్రలకు వన్నె తెచ్చిపెట్టారు. అలాంటి వారిని స్మరించుకోవడం మన కనీస ధర్మం. "ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు".

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X