»   » సినిమా మీద ఇష్టం ఏడుకోట్ల నష్టాన్నిచ్చింది: దర్శకుడు మహీ వీ రాఘవ్

సినిమా మీద ఇష్టం ఏడుకోట్ల నష్టాన్నిచ్చింది: దర్శకుడు మహీ వీ రాఘవ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్తూరు నుంచి బ్రిటన్‌, న్యూజిలాండ్‌ మీదుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అడుగు పెట్టి, దర్శకుడిగా మారి ఆనందో బ్రహ్మతో ఒక హిట్‌ని ఖాతాలో వేసుకున్న మహీ వీ రాఘవ్ చాలా కష్టాలనీ, ఎక్కువగానే నష్టాలనీ ఎదుర్కున్నాడు. సినిమా మీద ఉండే పిచ్చి ఇష్టం అతన్ని విదేశాల్లో ఉండనివ్వలేదు. టాలీవుడ్ వైపు వచ్చాక కూడా గట్టి దెబ్బలనే చూసాడు అయినా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసాడు. కార్నం ఒక్కటే సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే ఇష్టం అంతకంటే ఏం కావాలి.. తన జీవితం లోని ఎదురు దెబ్బల గురించి ఇలా చెప్పాడు మహీ రాఘవ్...

సుమారు 7 కోట్ల రూపాయల వరకు

సుమారు 7 కోట్ల రూపాయల వరకు

సినిమాల్లోకి వచ్చి సుమారు 7 కోట్ల రూపాయల వరకు నష్టపోయానని సినిమా దర్శకుడు మహీ వీ రాఘవ్ తెలిపారు. తన జీవితంలోని వివిధ దశల గురించి చెబుతూ, హార్స్ లీ హిల్స్ లోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నానని, అప్పట్లో సినిమాల గురించి అసలు తెలియదని అన్నారు. డిగ్రీలోకి వచ్చాక సినిమాలు చూసేవాడినని, ఎంబీఏలో ఉండగా సినిమాలపై ఇష్టం పెరిగిందని చెప్పారు.

నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి

నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి

కొన్నాళ్లకు స్నేహితులతో కలిసి నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి రెండేళ్లు విజయవంతంగా నడిపానని అన్నారు. ఆ తరువాత దానిని అమ్మేసి, ఎంఎస్ చేసేందుకు యూకే వెళ్లానని, చదువు మధ్యలోనే ఆపేసి, ఉద్యోగంలో జాయిన్ అయ్యానని ఆయన తెలిపారు. ఆ తరువాత మూడేళ్లకు న్యూజిలాండ్ వెళ్లి కష్టపడి సంపాదించానని, ఆ తరువాతే తాను సినిమాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

విలేజ్‌ లో వినాయకుడు

విలేజ్‌ లో వినాయకుడు

సాయికిరణ్‌ అడవి దర్శకత్వం వహించిన ‘వినాయకుడు' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశానని చెప్పారు. మార్కెటింగ్‌ మీద పట్టు ఉండడంతో ఆ సినిమాకు తాను హెల్ప్ అయ్యానని ఆయన అన్నారు. అది ఆకట్టుకోవడంతో వెంటనే నిర్మాతగా మారి అదే బృందంతో ‘విలేజ్‌ లో వినాయకుడు' సినిమా తీశానని ఆయన చెప్పారు.

సినిమాకు పేరొచ్చినా, డబ్బులు రాలేదు

సినిమాకు పేరొచ్చినా, డబ్బులు రాలేదు

ఆ సినిమాకు కథను తానే సమకూర్చానని, సినిమాకు మంచి పేరొచ్చినా, డబ్బులు రాలేదని ఆయన చెప్పారు. ఆ తరువాత వరుణ్‌ సందేశ్‌ తో ‘కుదిరితే కప్పు కాఫీ' సినిమాను నిర్మిస్తే అది కూడా నష్టాలే మిగిల్చిందని ఆయన వాపోయారు. ఇక నిర్మాతగా ఉండడం వేస్ట్ అనే నిర్ణయానికొచ్చి, దర్శకుడిగా మారి కొత్త నటీనటుల్ని ప్రోత్సహించేలా ‘పాఠశాల' సినిమా తీస్తే అది కూడా నిరాశపరిచిందని ఆయన చెప్పారు.

 7 కోట్ల రూపాయలు

7 కోట్ల రూపాయలు

ఇలా తాను సుమారు 7 కోట్ల రూపాయలు సినిమాల్లో నష్టపోయానని ఆయన తెలిపారు. దీంతో ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ హంగులతో ‘ఆనందో బ్రహ్మ' సినిమాను రూపొందించానని ఆయన చెప్పారు. ఈ సినిమా కథను నిర్మాత విజయ్‌ చిల్లా కంటే ముందు పది మందికి వినిపించానని, అయితే వారెవరూ ముందుకు రాలేదని ఆయన తెలిపారు. ఈ విజయం చాలా అపూర్వమైనదని ఆయన తెలిపారు.

English summary
Recently during the media interaction, Mahi revealed that after the completion of MBA, he started a business but after quitting everything, he tried to test his luck in Film Industry, as a producer he lost close to Rs 7 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu