»   » ఎంతపని చేసావ్ తాప్సీ: బొడ్డు మీద కొబ్బరి చిప్ప వివాదం, ఆ నిర్మాత నిండా మునిగినట్టే

ఎంతపని చేసావ్ తాప్సీ: బొడ్డు మీద కొబ్బరి చిప్ప వివాదం, ఆ నిర్మాత నిండా మునిగినట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటేనే అసలు దారుణం అన్నట్టు , అక్కడ టాలెంట్, నటనకంటే ఎక్స్ పోజింగ్ కే ఎక్కువ ప్రధాన్యం ఇస్తారన్నట్టు ఇటీవలే కొంచెం ఘాటైన స్టేట్ మెంట్ ఇచ్చింది తాప్సీ పన్ను. మోడలింగ్ నుంచి దక్షిణాది సినిమాల ద్వారానే పెద్ద తెరకు పరిచయం అయిన ఈ భామ ఇన్నేళ్లూ తనతో అర్థం లేని ఎక్స్ పోజింగ్ చేయించారని ఈ మధ్యనే వాపోయింది.

నా బొడ్డు మీద కొబ్బరి చిప్ప

నా బొడ్డు మీద కొబ్బరి చిప్ప

అక్కడితో ఆగిందా రాఘవేంద్రరావును బాలీవుడ్‌లో ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో బట్టలిప్పినంత పనిచేసింది. దర్శకేంద్రుడిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. రాఘవేంద్రరావు టార్గెట్ చేస్తూ ఆయన పేరు ఎత్తకుండానే "నా బొడ్డు మీద కొబ్బరి చిప్పతో కొట్టాడు" అంటూ దారుణం గా అవమానించింది.

రీసెంట్ కాంట్రవర్సీ

రీసెంట్ కాంట్రవర్సీ

దానికి ఆమె పెద్ద ఎత్తునే వ్యతిరేకత ఎదుర్కుంటోంది. ఇదంతా పక్కన పెడితే ఉరుము ఉరిమి మంగలం మీద పడిందన్నట్టు తాప్సీ యవ్వారం కొత్తగా ఆమె నటించిన ఆనందో బ్రహ్మ సినిమా మీద దెబ్బ వేసేట్టు గా తయారయ్యింది. ఎందుకంటే ఆమె రీసెంట్ కాంట్రవర్సీ తో తాప్సీ నటిస్తోన్న తెలుగు చిత్రాన్ని మూకుమ్మడిగా బాయ్‌కాట్‌ చేయాలనే పిలుపు ప్రభంజనమవుతోంది.

Taapsee Pannu, Amit Sadh's Running Shaadi.com Pramotions
'ఆనందోబ్రహ్మ

'ఆనందోబ్రహ్మ

ఆమె ప్రస్తుతం 'ఆనందోబ్రహ్మ' అనే హారర్‌ కామెడీ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ఎవరూ చూడరాదని సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పాస్‌ అవుతున్నాయి. ఆ చిత్రానికి తన పారితోషికం అందుకున్న తాప్సీకి దీని వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ నోటికొచ్చిన వాగుడుతో అనవసరంగా వివాదాన్ని లేపి తమ సినిమాని చిక్కుల్లో పడేసిందని ఆ సినిమా మేకర్స్‌ గగ్గోలు పెడుతున్నారు.

తెలుగులో అవకాశాలు రాకుండా

తెలుగులో అవకాశాలు రాకుండా

ఎలాగైనా ఈ వివాదానికి తెర వేయాలని, తాప్సీ సారీ చెప్పాలని వారు కోరుతుంటే అటు తాప్సీ కానీ, ఇటు ఆమె పీఆర్‌ టీమ్‌ కానీ దానికి అసలు స్పందించడం లేదట. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ గొడవలో తమ సినిమా ఎక్కడ నలిగిపోతుందోననేది వారి భయమట. ఏదేమైనా ఈ వ్యాఖ్యలతో ఇకపై మళ్లీ తెలుగులో అవకాశాలు రాకుండా తనకి తానే బ్రేక్స్‌ వేసుకుంది తాప్సీ.

English summary
Anando Brahma Team Upset With Taapsee Pannu Coconut Comments on Tollywood senior Director Raghavendra rao
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu