»   »  చిరును వీడి వై.యస్ వైపు అనంత్ శ్రీరామ్

చిరును వీడి వై.యస్ వైపు అనంత్ శ్రీరామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట నుంచీ చిరంజీవి క్యాంప్ లో కంటిన్యూ అవుతూ వస్తున్న యువ పాటల రచయిత అనంత్ శ్రీరామ్. అతను తాజాగా ప్లేట్ (సారీ) పార్టీ ఫిరాయించాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం పాటలు రాసి,టీవీ షోల్లో సైతం చిరంజీవికి సపోర్టుగా మాట్లాడిన శ్రీరాం ఈ రోజు సి.యం వై.యస్.రాజశేఖర్ రెడ్డిని కలసాడు.

కాంగ్రెస్ పార్టీ తరపున పాటలు రాయటానికి ఒప్పుకున్నాడు. దాంతో ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆరునెలలు కలసి తిరిగితే వారు వీరౌతారు అన్నట్లుగా ఈ ఆరునెలలుగా చిరంజీవి అనుయాయులతో పార్టీలో తిరిగిన ఇతను అప్పుడే రాజకీయాలు వంటపట్టించుకున్నాడని అంతా అంటున్నారు. అయితే అతను ఇలా హఠాత్తుగా పార్టీ ఫిరాయించటానికి కారణం మాత్రం తెలియరాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X