»   » యాంకర్ అనసూయ, అడవి శేష్‌లకు అవమానం!

యాంకర్ అనసూయ, అడవి శేష్‌లకు అవమానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు నుండి జూ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, హీరోయిన్ సమంత 'అ...ఆ' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది.

కాగా.... ఈ అవార్డు వేడుక నిర్వాహకులు తమను తీవ్రంగా అవమానించారని అంటున్నారు నటుడు అడవిశేష్. 'క్షణం' సినిమా గాను తనతో పాటు అనసూయకు ఫిల్మ్ ఫేర్ నామినేషన్స్ దక్కాయి. అయినప్పటికీ తమకు కనీసం ఆహ్వానం కూడా పంపకుండా తీవ్రంగా అవమానించారంటూ అడవి శేష్ తెలిపారు.

Anasuya, Adivi Sesh got insulted by Filmfare event organizers

ఈ విషయాన్ని అడవి శేష్ వెల్లడిస్తూ.... ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులు ఇలా ఎందుకు చేశారో తెలియదు. కానీ అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు అని అడిశేష్ తెలిపారు.

అయితే అనసూయకు కనీసం ఫోన్ కూడా చేయలేదట. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లి పోతోంది అనసూయ. టాలీవుడ్లో ఏ అవార్డుల వేడుక జరిగినా తన అందం, యాటిట్యూడ్ తో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండే అనసూయ ఈ సారి మాత్రం.... ఆహ్వానం అందని కారణంగా అవార్డుల వేడుకకు దూరంగా ఉంది.

English summary
As we all know, Anasuya and Adivi Sesh's last release Kshanam was a blockbuster hit in Tollywood. Their film together got nominated for 64th Filmfare South Awards but they didn't receive any invitation for the awards function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu