For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏందివ‌య్యా.. దిమాక్‌లో అటుది ఇటు.. ఇటుది అటు అయిందా?: యాంకర్ అనసూయ భరద్వాజ్

  |

  అసభ్యత, హాస్యం లాంటి విషయాల గురించి మాట్లాడితే అనవసరంగా పెడర్థాలు తీస్తున్నారంటూ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మండిపడుతున్నారు. 'అసభ్యత, అశ్లీలత గురించి నేను ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా.. బట్టలు సరిగా వేసుకోవాలంటారు. పోనీ కామెడీని కామెడీగా తీసుకుంటే మంచిదని చెబితే.. అర్జున్ రెడ్డి అంటారు. ఏందివయ్యా.. దిమాగ్ ల అటుది ఇటు.. ఇటుది అటు ఉందా' అంటూ పోస్ట్ చ్ఝేసింది అనసూయ..

  రెండో పెళ్లిపై నోరువిప్పిన అనసూయ..!
   అనాథలను కించపరిచేలా

  అనాథలను కించపరిచేలా

  వివాదాస్పద కామెడీ షో జబర్దస్‌పై వస్తోన్నలేటెస్ట్ కాంట్రవర్శిపై యాంకర్ అనసూయ స్పందించింది. తాజాగా హైపర్ ఆది చేసిన స్కిట్ అనాథలను కించపరిచేలా ఉందంటూ.. అనాథలు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ షోకి యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ క్షమాపణ చెప్పాలంటూ అనాథ యువతులు డిమాండ్ చేశారు.

   బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్

  బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్

  కాగా ఈ వివాదంపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పందిస్తూ.. తనకెందుకో జబర్దస్త్ షోపై ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తుందన్నారు. యాంక‌ర్‌గా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన అనుసూయ తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది. ‘జ‌బ‌ర్ద‌స్త్‌'ను స‌పోర్ట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాట‌లకు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.

  "జ‌బ‌ర్ద‌స్త్‌" ఓ బాహుబ‌లిలాంటిది

  "జ‌బ‌ర్ద‌స్త్‌" ఓ బాహుబ‌లిలాంటిద‌ని, ఆ కార్య‌క్ర‌మాన్ని విమర్శించి క్రియేటివిటీని కించ‌ప‌ర‌చ‌వ‌ద్ద‌ని ఫేస్‌బుక్ లైవ్‌చాట్‌లో అన‌సూయ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. దీంతో చాలా మంది ఆమె గ‌తంలో ‘అర్జున్‌రెడ్డి' విషయంలో చేసిన వ్యాఖ్య‌ల గురించి మాట్లాడుతున్నారు. `అర్జున్‌రెడ్డి`ని అంతలా విమ‌ర్శించిన‌పుడు క్రియేటివిటీ గుర్తుకురాలేదా అంటూ చాలా మంది ప్ర‌శ్నించారు.

   వాళ్లు చేసిన స్కిట్ అలాంటిది

  వాళ్లు చేసిన స్కిట్ అలాంటిది

  'ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు (జబర్ధస్త్‌లో) చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమానికి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం కొన్ని పదాలు అలా తీసుకున్నారు. వాటిని చూసి నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే.

  జబర్ధస్త్ హిస్టరీ చరిత్ర సృష్టించింది

  జబర్ధస్త్ హిస్టరీ చరిత్ర సృష్టించింది

  లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుందని' ఫేస్‌బుక్ వీడియోలో హైపర్ ఆది స్కిట్‌పై స్టార్ యాంకర్ అనసూయ స్పందించిన విషయం తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ చరిత్ర సృష్టించిందన్న అనసూయ.. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

  ఫేస్‌బుక్ ఖాతా ద్వారా

  ఫేస్‌బుక్ ఖాతా ద్వారా

  దీంతో వాటికి త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అన‌సూయ మరోసారి స‌మాధాన‌మిచ్చింది. "అరే.. నేను అస‌భ్య‌క‌ర‌మైన డైలాగ్‌ల గురించి మాట్లాడితే బ‌ట్ట‌లు స‌రిగా వేసుకోమంటారు. నేను ఫ‌న్‌ని ఫ‌న్‌లా తీసుకోండంటే.. `అర్జున్ రెడ్డి` అంటారు. ఏందివ‌య్యా.. దిమాక్‌లో అటుది ఇటు.. ఇటుది అటు అయిందా` అని పోస్ట్ చేసింది.

  ఏమ‌నుకోవ‌ద్దు

  ఏమ‌నుకోవ‌ద్దు

  అనంత‌రం `క్ష‌మించండి.. ఏమ‌నుకోవ‌ద్దు.. వితండ‌వాదాలు చేసేవాళ్ల‌ని, ఊరికే గెలుకుదాం అనుకునేవాళ్ల‌ని, నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లని బ్లాక్ చేద్దామ‌ని డిసైడ్ అయ్యా. నా ఆనందం నా చేతుల్లో ఉన్న‌ట్టు.. మీరు కూడా మీకు ఏది న‌చ్చితే అది చెయ్యండి. నిజాయితీగా, ఆనందంగా ఉండే వ్య‌క్తులే నా చుట్టూ ఉండాల‌ని కోరుకుంటా'' అంటూ మ‌రో పోస్ట్ చేసింది.

  English summary
  Anasuya bharadwaj Answer on Jabardasth Hyper Aadi controversy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X