»   » తుపాకి ఎక్కు పెట్టిన యాంకర్ అనసూయ (క్షణం మూవీ లుక్)

తుపాకి ఎక్కు పెట్టిన యాంకర్ అనసూయ (క్షణం మూవీ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అడవి శేషు-ఆదాశర్మ జంటగా నటిస్తున్న ‘క్షణం' అనే సినిమా యాంకర్ అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాురు. ఈ మూవీలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అనసూయ్ లుక్ విడుదలైంది.

గన్ ఎక్కు పెట్టి మఫ్టీలో ఉండే పోలీస్ గెటప్ లో ఆమె ఉండటం బట్టి ఆమె ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రవికాంత్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉండటంతో, అది అనసూయ చేస్తే బాగుంటుందని ఈ సినిమా యూనిట్ భావించిందట.

Anasuya look in Kshanam Moive

కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో, ఈ సినిమా చేయడానికి అనసూయ ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో అనసూయ తన గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అయితే ‘క్షణం'లో మాత్రం ఆమె ఫుల్ యక్షన్ మోడ్ లో కనిపిస్తుందని స్పష్టమవుతోంది.

English summary
Anasuya look in upcoming Kshanam Moive.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu