»   » రంగమ్మత్త క్యారెక్టర్ చూసి అనసూయ భర్త రియాక్షన్ ఇలా...

రంగమ్మత్త క్యారెక్టర్ చూసి అనసూయ భర్త రియాక్షన్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర, సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర, ఆది పోషించిన కుమార్ బాబు పాత్ర, జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ అలా నిలిచిపోయేంత ఇంపాక్ట్ చూపించాయి. ఈ పాత్రలన్నింటికీ ఎంత పేరు వచ్చిందో.... అందుకు ఏ మాత్రం తగ్గని గుర్తింపు వచ్చి అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్రకు.

'రంగమ్మత్త' పాత్ర అనసూయకు కెరీర్ టర్నింగ్ రోల్ అని చెప్పక తప్పదు. అప్పటి వరకు అనసూయ అంటే గ్లామర్ పాత్రలు, నాటీ యాటిట్యూడ్ ఉండే పాత్రలు చేయగలదనే అభిప్రాయం మాత్రమే ఉంది. అయితే 'రంగమ్మత్త' పాత్రతో ఆమెను ఇంకా చాలా రకాలుగా తెరపై చూపించవచ్చే అభిప్రాయానికి వచ్చారు ఫిల్మ్ మేకర్స్. ప్రేక్షకులు కూడా రంగమ్మత్తగా అనసూయ పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దులైపోయారు.

Anasuya’s Husband Reaction on Rangammatha Role

"రంగమ్మత్త పాత్ర గురించి దర్శకుడు సుకుమార్ నాకు చెప్పినపుడు ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో అని నాకు తెలియదు. తెలిసిన తర్వాత షాకయ్యాను. రామ్ చరణ్ నా ఫేవరెట్ స్టార్... ఆయనతో అత్త అని పిలిపించుకోలేను అని చెప్పాను. పాత్ర పేరు రంగమ్మగా మార్చాని కోరారు. కానీ అత్త అని పిలిస్తే తప్ప సీన్ పండదు అని చెప్పడంతో చేయక తప్పలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత నా పాత్రకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు, ఇపుడు రంగమ్మత్త అని పిలిపించుకోవడం సంతోషంగా ఉంది అని అనసూయ తెలిపారు.

సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రంగమ్మత్తగా చాలా బాగా చేశారని ప్రశంసిస్తున్నారు. మా ఆయన నుండి కూడా పొగడ్తలు వచ్చాయి. నా కెరీర్లోనే రంగమ్మత్త ది బెస్ట్ రోల్ అని ఆయన అనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నా జీవితంలో పొందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే. ఈ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా గొప్పగా ఫీలవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ సర్‌ను ఎప్పటికీ మచిరిపోలేను.... అని అనసూయ అన్నారు.

English summary
"I requested director Sukumar to change my name to Ragamma from Rangammatha as I felt wierd when Ram Charan addressed me as 'Atha', But after watching the movie, everyone praised my character in the movie including my husband. He said that Rangammatha will remain as one of the best roles in my career," Anasuya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X