»   »  ఆ క్షణం..అనసూయ ఇలా...(ఫొటో)

ఆ క్షణం..అనసూయ ఇలా...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అనసూయ, ఆదా శర్మ, అడవి శేషు మరియు సత్య దేవ్ కలిసి నటించిన థ్రిల్లర్ 'క్షణం'. ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ విడుదలైంది. దానిని అనసూయ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోస్ట్ ఇక్కడ చూడండి.

And so!! This is how v look!! Woot!! 🤓󾍇󾌧󾌾 #Kshanam #FirstPosters

Posted by Anasuya Bharadwaj on 3 February 2016

అడవి శేష్‌, అదా శర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం'. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలు. హైదరాబాద్‌లో బుధవారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేనూ, అడవి శేష్‌ కలిసి ఈ కథ తయారు చేశాం. పీవీపీ సంస్థకు నచ్చడంతో దర్శకుడిగా తొలి అవకాశం దక్కింది. కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ల బాలికను కొందరు వెదికే నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్‌, వినోదం మేళవించాం. మూడు పాటలున్నాయి. శ్రీచరణ్‌ సంగీతం ఆకట్టుకొంటుంది''అన్నారు.

Anasuya's Kshanam first look out

పరమ్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ ‘‘ట్వంటియత్‌ సెంచరీ, బ్లూ ఫాక్స్‌, పారామౌంట్‌ సంస్థల్లా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకొనే చిత్రాల్ని నిర్మించాలన్నది పీవీపీ సంస్థ ఉద్దేశం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతికనిపుణుల సమష్టి కృషితో తెరకెక్కింది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది'' అన్నారు.

అడవి శేష్‌ చెబుతూ ‘‘నా జీవితంలో ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ఈ కథని తయారు చేశాం. తెరపై కనిపించే ప్రతి పాత్ర విభిన్నంగా సాగేదే'' అన్నారు.

పోలీస్‌ పాత్ర లో నటించానని అనసూయ చెప్పింది. ఈ కార్యక్రమంలో సత్యదేవ్‌, శ్రీచరణ్‌ , షనిల్‌ డియో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: అర్జున్‌ శాస్త్రి, రవికాంత్‌ పేరెపు

English summary
Anasuya's upcoming thriller ‘Kshanam’ makers released the first look today. Film produced on PVP banner is slated for grand release on March, 4th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu