»   » రంగస్థలం థాంక్స్ మీట్ సాక్షిగా సారీ చెప్పిన అనసూయ!

రంగస్థలం థాంక్స్ మీట్ సాక్షిగా సారీ చెప్పిన అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం టాలీవుడ్లో పలు రికార్డులు బద్దలు కొడుతూ వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ మైత్రీ మూవీ మేకర్స్ వారు సోమవారం థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రంగమ్మత్తగా నటించిన అనసూయ ఆసక్తికరంగా ప్రసంగం ఇచ్చింది.

Rangasthalam Movie Is About To Reach 100Cr Collection
 మీ ఇద్దరి ఇబ్బంది పెట్టాను, సారీ

మీ ఇద్దరి ఇబ్బంది పెట్టాను, సారీ

ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కంగారుతో ఎక్కువగా మాట్లాడలేక పోయాను. ఈ థాంక్యూ మీట్లో చెప్పాల్సింది అంతా చెప్పదలుచుకున్నాను. సుక్కూ సార్ మా రంగస్థల బ్రహ్మ. మీకు చాలా సార్లు నేను నస పెట్టాను. మా చిట్టిబాబుపై కూడా ప్రతి సారి గొనుగుతూ వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని అనసూయ అన్నారు.


చరణ్‌తో రంగమ్మత్త అని పిలిపించుకోనని చెప్పాను

చరణ్‌తో రంగమ్మత్త అని పిలిపించుకోనని చెప్పాను

రామ్ చరణ్ నా ఫేవరెట్ కో స్టార్. సుకుమార్ సార్ నారోల్ గురించి చెప్పినపుడు అతడితో రంగమ్మత్త అని పిలిపించుకోలేను, నన్ను చరణ్ అత్త అని పిలిస్తే ఒప్పుకోను, అదే సమయంలో అతడిని అల్లుడు అని అస్సలు పిలవలేను అని చెప్పాను. కానీ ఈ రోజు రంగమ్మత్త అనే పిలుపంత వినసొంపైన పదం లేదని నాకు అనిపిస్తోంది. రంగస్థలం లాంటి ప్రాజెక్ట్ నాకు ఒక గొప్ప అచీవ్మెంటు లాంటిది... అని అనసూయ తెలిపారు.


సుక్కు సార్ టాప్

సుక్కు సార్ టాప్

సినిమాలో రంగమ్మత్తను ఈ రకంగా రిసీవ్ చేసుకున్నారంటే అందుకు కారణం మై ఫేవరెట్ సుక్కూ సార్. నేను ఆర్టిస్టును అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఐదుగురు దర్శకులతో తప్పకుండా పని చేయాలని ఓ లిస్టు రాసుకున్నాను. అందులో సుకుమార్ సార్ పేరు టాప్‌లో ఉంటుంది. ఇంత తొందరగా ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.... అని అనసూయ తెలిపారు.


మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారు

మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారు

రామ్ చరణ్‌ను చూసిన తర్వాత నాకు పెర్ఫార్మెన్స్ వైజ్ స్వయం కృషి సినిమా గుర్తొచ్చింది. కలెక్షన్స్ వైజ్ ఖైదీ గుర్తొచ్చింది. స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు ఇలాంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత యాడ్ అయ్యాయో.... రామ్ చరణ్‌‌కు ‘రంగస్థలం' అలాంటి సినిమా అవుతుంది అని అనసూయ అభిప్రాయ పడ్డారు.


మైత్రి మూవీ మేకర్స్

మైత్రి మూవీ మేకర్స్

మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ పని తీరు ఎలా ఉంటుందో అంతకు ముందు విన్నాను. రంగస్థలం సినిమా ద్వారా స్వయంగా చూశాను. వారు ఆర్టిస్టులకు ఎంతో స్పేస్ ఇస్తారు. ఇలాంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. రత్నవేలుగారు నన్ను తెరపై ఎంతో బాగా చూపించారు అని అనసూయ తెలిపారు.


English summary
Anasuya Superb Speech about Ram Charan & Sukumar at Rangasthalam Thank You Meet. Rangasthalam Movie ft. Ram Charan, Samantha, Pooja Hegde and Aadhi Pinisetty. #Rangasthalam is directed by Sukumar and Music composed by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X