»   » పాపం అనసూయ డబ్బులెగ్గొట్టారట, మెగా హీరో సినిమా ....

పాపం అనసూయ డబ్బులెగ్గొట్టారట, మెగా హీరో సినిమా ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ యాంకర్ అనసూయ.... యాంకరింగుతో పాటు ఎప్పుడూ వార్తల్లో ఉండేది. అప్పట్లో 'అత్తారికింటికి దారేది' సినిమా సమయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందొ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమెకు స్పెషల్ సాంగ్ చేయాలని అడిగితే కాదంది. మా హీరోను కాదంటావా... అంటూ అప్పట్లో సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెతో గొడవ పడ్డారు.

అనసూయ కూడా వారికి కాస్త ఘాటుగానే బదులిచ్చింది. తర్వాత క్రమ క్రమంగా అనసూయ సినిమాల వైపు రావడం... నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా నటించడం తెలిసిందే. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి కూదా తెలిసిందే.

'సూయా సూయా అనసూయ' అని తనపేరు మీదే పాట ఉండటంతో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయడానికి ఒప్పుకుందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అనసూయ ఈ ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒప్పుకోవడానికి ఇంకో కారణం కూడా ఉందంటున్నారు సినీ జనాలు.

Anasuya

అది ఏంటంటే ఈ పాటకోసం అనసూయ అక్షరాలా 25 లక్షలు తీసుకుందని చెప్పుకున్నారు. అసలు అంత ఎందుకు ఇస్తున్నారూ అంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు కూడా రాసేసాయి అయితే అక్కడ అనసూయ అడిగిందీ వాళ్ళిస్తామని ఒప్పుకున్నదీ 14 లక్షలేనట, పాపం దాన్లో కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన కొన్ని లక్షల రూపాయలను ఎగ్గొట్టారట.

అయితే ఈ పాట కి అనసూయకు పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్‌ అందలేదట. ఈ పాట కోసం అనసూయతో 14 లక్షల రూపాయలకు ఒప్పందం జరిగిందట. అడ్వాన్స్‌గా పది లక్షలు చెల్లించారట నిర్మాతలు. అయితే అనుకున్న సమయంలో పాట పూర్తవకపోవడంతో మరో మూడు రోజులు అదనంగా పనిచేసిందట అనసూయ.

దీనికి గాను మరో ఆరు లక్షలు అదనంగా చెల్లిస్తామని మాట ఇచ్చారట. అంటే మొత్తం పది లక్షలు. కానీ, ఇప్పుడు ఆ చిత్ర యూనిట్‌ ఈ పది లక్షల ఊసే ఎత్తడం లేదట. ప్రమోషన్లకు, ప్రీ-రిలీజ్‌ ఈవెంట్లకు హాజరవుతున్నా తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడకపోవడంతో ఆమె తెగ ఫీలైపోతోందట.అయినా ఈ విషయం మాత్రం బయటకు చెప్పకుండా ఇంకా ఆ సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉంది.

English summary
As per the update, Anasuya has been promised a remuneration of Rs 20 lakhs by the makers of the film. She has been paid Rs 12 lakhs and the balance amount has been kept on hold.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu