»   » తల్లిని తిట్టడమేంటి? ... ‘అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్

తల్లిని తిట్టడమేంటి? ... ‘అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Anasuya Fire On "Arjun Reddy" Dialogues

ఇటీవల విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఓ వైపు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్నప్పటికీ, సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు, బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరగుతోంది.

ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా 'అర్జున్ రెడ్డి' సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో హీరో ఎవరినో తిట్టేక్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు పయోగించడంపై అనసూయ మండి పడుతున్నారు.

తిట్లు ఓకే, కానీ అలాంటి చెత్త తిట్లేంటి?

తిట్లు ఓకే, కానీ అలాంటి చెత్త తిట్లేంటి?

ఎమోషన్‌కు గురైనపుడు తిట్లు రావడం మామూలే. కానీ అందుకు చాలా పదాలు ఉన్నాయి. తల్లిని ఉద్దేశించిన తిట్లు వాడటం సరైంది కాదు అనేది అనసూయ వాదన. దీనిపై ఆమె ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ చేశారు.


ఇది దారుణం

ఇది దారుణం

మహిళలను, ముఖ్యంగా తల్లిని కించపరిచే విధంగా ఉండే పదాలను, తిట్లను తాను అస్సలు సపోర్టు చేయను..... ప్రతి ఒక్కరికి అమ్మ, చెల్లి, భార్య ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి అనే విధంగా అనసూయ స్పందించారు.


ట్విట్టర్లో వార్

ట్విట్టర్లో వార్

అనసూయ ఈ కామెంట్స్ చేయడంతో ట్విట్టర్లో అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు ఆమెపై దాడి చేయడం మొదలు పెట్టారు. మీ బజర్దస్త్ లో మహిళలను కించ పరుస్తూ చాలా స్కిట్లు చేస్తున్నారు. జబర్దస్త్ ను మించిన బూతు ఈ సినిమాలో ఏమీ లేదు అంటూ ఆమె కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు.


హైపోక్రైట్ అంటూ విమర్శలు

హైపోక్రైట్ అంటూ విమర్శలు

ఈ క్రమంలో చాలా మంది అనసూయపై ఆమె హైపోక్రైట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాను చేస్తున్న టీవీ షోలలో కావాల్సినంత బూతు ఉంటోంది, అలాంటి వ్యక్తి అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేయడం ఏమిటీ అంటూ మండి పడుతున్నారు.


క్యారెక్టర్ పరంగా వచ్చిన తిట్లే తప్ప...

క్యారెక్టర్ పరంగా వచ్చిన తిట్లే తప్ప...

సినిమాలో క్యారెక్టర్ పరంగా వచ్చిన తిట్లే అవి, మహిళలను ఉద్దేశించి కించపరిచే సీన్లు ఏమీ లేవని, మహిళల పట్ల సినిమాలో చాలా రెస్పెక్ట్ చూపించారు. దాన్ని అర్థం చేసుకోకుండా అనసూయ కావాలని రాద్దాంతం చేస్తున్నట్లు ఉందని విమర్శిస్తున్నారు


రాజమౌళి, కేటీఆర్

రాజమౌళి, కేటీఆర్

రాజమౌళి, కేటీఆర్ లాంటి వారు సినిమాను చూసి మెచ్చుకున్నారు. సినిమాలో మంచి కంటెంటు ఉంది కాబట్టే అలాంటి వ్యక్తులు సైతం సినిమాపై బహిరంగంగా ప్రశంసలు గుప్పించారు. ఈ విషయాన్ని అసూయ గుర్తించాలని అంటున్నారు.English summary
Anchor turned actress Anasuya busted out in anger on the film Arjun Reddy, which is running to packed crowds. "#ArjunReddy #AbusingMother #NotCool #NeverCool. Period" is her final tweet about the film, but that's when started some thing that will hurt her more. Many followers on twitter started abusing her back, saying that she's being a hypocrite.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu