Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిగ్ బాస్ ముగిసింది వివాదం ఎగిసింది.. శ్రీముఖి పేరు చెప్తూ మరో యాంకర్ సెన్సేషన్
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించిన ఏదో ఒకరకమైన వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నడుమనే షో ముగిసింది. షో ముగిశాక కూడా మళ్ళీ సరికొత్త వివాదం ఎగిసి పడుతుండటం సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా వివాదం? వివరాల్లోకి పోతే..

బిగ్ బాస్ విన్నర్ రాహుల్.. రన్నర్ శ్రీముఖి
100 రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా సాగిన బిగ్ బాస్ సీజన్ 3 ట్రోఫీ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. విన్నర్ అవుతుందన్న యాంకర్ శ్రీముఖి రన్నరప్‌తో సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయమై శ్రీముఖి ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ, పలువురు సెలెబ్రిటీలు బిగ్ బాస్ తీరు తప్పుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

వరుసపెట్టి మూడు సీజన్లు.. అందరూ!
తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికి మూడు సీజన్లు ముగించుకుంది. మొదటి సీజన్‌లో ట్రోఫీ విన్నర్ శివ బాలాజీ కాగా రెండో సీజన్‌లో కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇక ఇటీవలే పూర్తి చేసుకున్న మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ప్రకటించబడి ఆశ్చర్యపర్చాడు. ఇదే విషయమై లాజిక్ అప్లై చేస్తూ యాంకర్ ఝాన్సీ విరుచుకుపడింది.

యాంకర్ ఝాన్సీ కామెంట్స్.. తీవ్ర చర్చలకు దారి
తొలి రెండు సీజన్లలోనూ పురుష కంటెస్టెంట్లే గెలిచారని, ఈ సారైనా మహిళను గెలిపిద్దామని శ్రీముఖి అభిమానులు ప్రచారం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకో లేదని అసహనం వ్యక్తం చేసింది యాంకర్ ఝాన్సీ. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.

అక్కడే లేదు.. ఇక్కడెందుకు ఉంటుంది
అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదని, అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇక్కడ బిగ్‌బాస్ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నిస్తూ కామెంట్ పెట్టింది ఝాన్సీ. లింగభేదం ఇప్పటికీ ఉందని పేర్కొంటూ తన అసహనం వ్యక్త పరిచింది. ఈ మేరకు బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి పర్‌ఫార్‌మెన్స్ తనకు బాగా నచ్చిందని తెలిపింది ఝాన్సీ.