»   » అనసూయ వ్యవహారం, రష్మికి కొత్త తలనొప్పి... గతంలో చేదు అనుభవాలు!

అనసూయ వ్యవహారం, రష్మికి కొత్త తలనొప్పి... గతంలో చేదు అనుభవాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టీవీ యాంకర్, నటి అనసూయ సెల్ఫీ అడిగితే ఓ పదేళ్ల బాలుడి ఫోన్ బద్దలు కొట్టడం, ఆ బాలుడి తల్లిని దుర్భాషలాడటం వివాదం అయిన సంగతి తెలిసిందే. అనసూయ ప్రవర్తనపై బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదే అదునుగా నెటిజన్లు అనసూయ మీద విరుచుపడుతూ సోషల్ మీడియా ద్వారా ఆమెపై ముప్పేట కామెంట్ల దాడి చేశారు.

Anchor Anasuya in a Bizarre Controversy, Video
తలుపులు మూసిన అనసూయ

తలుపులు మూసిన అనసూయ


బాలుడి వివాదం నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా ద్వారా తనపై లెక్కకు మిక్కిలి విమర్శలు, కామెంట్లు వస్తుండటంతో అనసూయ..... తన సోషల్ మీడియా తలుపులు మూసివేసింది. ఎవరూ తనపై కామెంట్లు చేయకుండా ఖాతాలను తాత్కాలికంగా క్లోజ్ చేసింది.

యాంకర్ రష్మికి కొత్త తలనొప్పి

యాంకర్ రష్మికి కొత్త తలనొప్పి

అనసూయ యాంకర్ రష్మికి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో..... నెటిజన్ల దృష్టి రష్మి మీద పడింది. అనసూయ సోషల్ మీడియా ఖాతాలు మూసి వేయడంతో రష్మికి పలువురు సందేశాలు పంపుతున్నారు. ఈ వ్యవహారం ఆమెకు కొత్త తలనొప్పిగా మారింది.

అనసూయకు నువ్వైనా బుద్ది చెప్పు

అనసూయకు నువ్వైనా బుద్ది చెప్పు

యాంకర్ అనసూయకు నువ్వైనా బుద్ది చెప్పు, ప్రజలతో, అభిమానులతో ముఖ్యంగా చిన్న పిల్లలతో ఎలా మసులుకోవాలో చెప్పు అంటూ..... యాంకర్ రష్మికి ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో కామెంట్లు వెళ్లువెత్తుతున్నాయి.

కామెంట్లకు రిప్లై ఇచ్చిన రష్మి`

అనసూయ చేసిన పనికి తనకు కామెంట్లు వస్తుండటంతో..... రష్మి స్పందించారు. నేను ఆమెకు గార్డియన్ కాదు, ఆమె వ్యవహారంలోకి నన్ను లాగడం సరికాదు అనే రీతిలో రష్మి సమాధానం ఇచ్చారు.

తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించిన రష్మి

ఈ సందర్భంగా రష్మి తనకు గతంలో జరిగిన ఓ చేదు అనుభవం గురించి వివరించింది. ఓ సారి తన షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంటే అర్దరాత్రి పూట నలుగురు కుర్రాళ్లు రెండు బైక్స్ మీద తనను వెంబడించారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

పనీ పాటలేని వాళ్లు

ఆ నలుగురు నా కారును వెంబడిస్తుంటే మా డ్రైవర్ వీలైనంత వరకు వారికి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ పనీ పాటలేని వారు నా కారునే వెంబడించారు.... అని రష్మి గుర్తు చేసుకున్నారు.

సెల్ఫీ కావాలంటూ డిమాండ్ చేశారు

వారి ప్రవర్తనతో విసుగుచెంది కారు ఆపడంతో వారు సెల్ఫీ కావాలని డిమాండ్ చేశారు. లేక పోతే నిన్ను విడిచి పెట్టం అనేలా కమాండ్‌గా మాట్లాడారు... అని రష్మి తనకు ఎదురైన అనుభవం గురించి తెలిపారు.

అదృష్ట వశాత్తూ పోలీసులు వచ్చారు

ఆ రాత్రి సమయంలో అదృష్టవశాత్తు పోలీసులు వచ్చారు. వారు రాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు.... అంటూ అభిమానులు చేసే చేష్టల గురించి రష్మి వివరించారు.

ఇలాంటి అనుభవాలు చాలా సార్లు

అభిమానులతో ప్రతిసారి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. వారు వేగంగా మా కారును వెంబడిస్తుంటే ఒక్కోసారి వారి ప్రవర్తన వారి లైఫ్‌ను రిస్కులో పడేసుకుంటారనే భయం కూడా కలుగుతుంది అని రష్మి తెలిపారు.

నేను సెల్ఫీలను ఎంకరేజ్ చేయను

అనసూయ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా... ఆమెకు అడ్వైజ్ ఇవ్వు అని చాలా మంది చెబుతున్నారు. అవును, ఆమె నా ప్రియమిత్రురాలు, ఆమె గురించి నాకు తెలుసు. అనసూయ కంటే నేను చాలా కఠినం. నేను సెల్ఫీలను అస్సలు ఎంకరేజ్ చేయను.... అని రష్మి తెలిపారు.

అనసూయ అలాంది కాదు

అనసూయ కూడా ఇద్దరు పిల్లల తల్లి. ఆమె ఒక పిల్లాడి చేతి నుండి ఫోన్ లాక్కుని పగలగొట్టిందంటే నేను నమ్మను. ఆమె అలా ప్రవర్తించే రకం కాదు... అని ఈ సందర్భంగా రష్మి తెలిపారు.

కఠినాత్మురాలు: యాంకర్ అనసూయపై సోషల్ దాడి... తట్టుకోలేక అదృశ్యం!

కఠినాత్మురాలు: యాంకర్ అనసూయపై సోషల్ దాడి... తట్టుకోలేక అదృశ్యం!

బాలుడి ఫోన్ బద్దలు కొట్టిన వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా యాంకర్ అనసూయపై కామెంట్ల వర్షం కురుస్తోంది. దీన్ని తట్టుకోలేక యాంకర్ అనసూయ తన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మూసి వేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Actress Rashmi Gautam has responded to the controversy surrounding Anasuya Bharadwaj breaking a fan's phone and revealed a shocking story of how fans chased her for a selfie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu