»   » యాంకర్ రవి, శ్రీముఖిని చెప్పుతో కొడుతాం..నర్సు ఆగ్రహం

యాంకర్ రవి, శ్రీముఖిని చెప్పుతో కొడుతాం..నర్సు ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నర్సుల వృత్తిని కించపరిచే విధంగా వ్యవహరించిన యాంకర్లు రవి, శ్రీముఖిలపై ఎల్బీ నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన తర్వాత రవి, శ్రీముఖిలపై నర్సెస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుస్మిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పటాస్‌లో నర్సులపై దారుణమైన కామెంట్స్

పటాస్‌లో నర్సులపై దారుణమైన కామెంట్స్

మార్చి 4వ తేదీ రోజు రాత్రి 9 గంటలకు ఈటీవీలో ప్రసారమైన పటాస్ కార్యక్రమంలో నర్సులపై అతి దారుణంగా కామెంట్లు చేశారు. వారు చేసే వెధవ పనులను వేలెత్తి చూపించే పొజిషన్‌లో మేమున్నాం కానీ మమ్మల్ని వేరొకరు వేలెత్తి చూపించే స్థితిలో లేము.

ముగ్గురిపై ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు

ముగ్గురిపై ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు

మా మనోభావాలను కించపరిచిన వారిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. శ్రీముఖి, రవి, యాదవరాజు చర్య తీసుకొంటామని పోలీసుల హామీ ఇచ్చారు.

ఇదేం తీరు.. నిలదీస్తామని ఆగ్రహం

ఇదేం తీరు.. నిలదీస్తామని ఆగ్రహం

పటాస్ కార్యక్రమంలో చేసిన కామెంట్లపై వారిని నిలదీయాలనుకొంటున్నాం. ఆ నా కొడుకుల తల్లిదండ్రులు హాస్పిటల్‌కు వచ్చి వైద్య చేయించుకోలేదా, వారికి సరైన చికిత్స జరుగలేదా అని సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

నర్సులందరూ చెప్పుతో కొడుతారు

మీరు చేసిన కామెంట్లకు నర్సులందరూ మిమ్మల్ని చెప్పుతో కొడుతారు. ఎంతో పవిత్రమైన వృత్తిలో కొనసాగుతూ ప్రతీ పేషంట్‌కు భరోసానిస్తున్నాం. అలాంటి తమపై చెత్త వాగుడు వాగుతున్న మిమ్మల్ని చెప్పుతో కొడుతామని ఆమె హెచ్చరించారు.

English summary
Anchor ravi, Sreemukhi derogatory comments on nurses. So a case filed on Srimukhi, Ravi, Yadava Raju in Hyderabad's LB Nagar Police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu